Rohit Sharma: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే సిడ్నీ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో గెలుపు దిశగా టీమిండియా దూసుకు వెళ్తోంది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా ఇది సాధ్యమైంది. అయితే చేజింగ్ చేసే క్రమంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేవలం 105 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు హిట్ రోహిత్ శర్మ. సింగిల్ తీసి, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిటైర్మెంట్ తీసుకోవాలని అతనిపై దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నా నేపథ్యంలో.. సెంచరీ తో కౌంటర్ ఇచ్చాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ సెంచరీ చేసిన నమోదు చేసుకున్న నేపథ్యంలో స్టేడియంలో ఉన్న అభిమానులందరూ లేచి చప్పట్లు కొట్టారు. అటు విరాట్ కోహ్లీ కూడా… రోహిత్ శర్మకు కంగ్రాట్స్ చెప్పాడు. ఇక 33 ఓవర్లు ఆడిన టీమిండియా ఒకే వికెట్ కోల్పోయి 200 పరుగులు చేసింది. మరో 37 పరుగులు చేస్తే, మూడో వన్డేలో విజయం సాధిస్తుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ వన్డేలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ అరుదైన సంఘటన వైరల్ గా మారింది. రోహిత్ శర్మ ప్రైవేట్ పార్ట్ పై విరాట్ కోహ్లీ బ్యాట్ తో కొట్టాడు. తన షూ లేస్ కట్టుకునేందుకు రోహిత్ శర్మ కిందికి వంగాడు. ఆ సందర్భంగా వెనుక నుంచి వచ్చి తన ఎంఆర్ఎఫ్ బ్యాట్ తో రోహిత్ శర్మ ప్రైవేట్ పార్టీపై కొట్టేశాడు విరాట్ కోహ్లీ. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఉన్నాడంటే కచ్చితంగా కామెడీ జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
సిడ్ని వేదికగా జరుగుతున్న మూడవ వన్డేలో సెంచరీ నమోదు చేసుకున్న రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్ గా ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు హిట్ మాన్ రోహిత్ శర్మ. ఇప్పటి వరకు రోహిత్ శర్మ… ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు నమోదు చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ గతంలో 9 సాధించగా… ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. వీళ్ళిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
MOST ODI HUNDREDS Vs AUSTRALIA:
Rohit Sharma – 9*.
Sachin Tendulkar – 9.
Virat Kohli – 8. pic.twitter.com/r91JccX4Ek
— Tanuj (@ImTanujSingh) October 25, 2025
Only Virat Kohli can do this with Rohit Sharma in this team😅
Virat Kohli appreciates Rohit Sharma after his half-century.
PC: Jiostar#RohitSharma #ViratKohli #AUSvIND #ODI #Cricket pic.twitter.com/oifnfRFz6Y
— OneCricket (@OneCricketApp) October 25, 2025