E-Paper
Advertisement

Rohit Sharma speech in Telugu : రోహిత్ శర్మ.. తెలుగులో ఇంత వీకా… అయినా సరే ఫ్యాన్స్ ఖుషీ

Rohit Sharma speech in Telugu : రోహిత్ శర్మ.. తెలుగులో ఇంత వీకా… అయినా సరే ఫ్యాన్స్ ఖుషీ
Advertisement
Rohit Sharma speech in Telugu

Rohit Sharma speech in Telugu : హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడేందుకు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చిన రోహిత్ శర్మ.. తెలుగులో మాట్లాడాడు. తెలుగులో మాట్లాడినందుకు సంతోషించాలో.. ఆ తెలుగు అలా ఉన్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. అన్నా నువ్ మావోడివే అని చెప్పుకోవడం, విశాఖ వస్తే రోహిత్ శర్మ హోం గ్రౌండ్ అని చెప్పుకోవడం తప్ప.. నిజంగా రోహిత్ శర్మకు తెలుగుతో అంత అనుబంధం లేదు.

రోహిత్ శర్మ 1987లో నాగ్‌పూర్‌లో పుట్టాడు. రోహిత్ శర్మ అమ్మ పూర్ణిమ శర్మ సొంత ఊరు విశాఖపట్నం. నాన్న గురునాథ్ శర్మ ఒక ట్రాన్‌పోర్ట్ కంపెనీలో పని చేసేవారు. రోహిత్ అమ్మ, నాన్న ఒక సింగిల్ రూమ్‌లో ఉండేవాళ్లు. కొడుకును కూడా అక్కడ ఉంచలేక తాతయ్య దగ్గరకు పంపారు. అంటే, రోహిత్ శర్మ పెరిగింది మొత్తం ముంబైలోని బోరివలిలోని వాళ్ల నానమ్మ, తాతయ్య దగ్గరే. అమ్మ విశాఖ ఆడపడుచు అని చెప్పుకోవడం మినహా.. రోహిత్ శర్మకు తెలుగుతో సంబంధం లేదు. అందుకే, తెలుగులో ఇంత వీక్.

Advertisement

పైగా రోహిత్ శర్మ తెలుగు సినిమాలు కూడా చూడడు. ఓ సందర్భంలో రోహిత్ శర్మనే ఈ విషయం చెప్పాడు. మీరు తెలుగు సినిమాలు చూస్తారా, మీకు నచ్చిన సినిమాలు చెప్పండి అంటే.. తాను అసలు తెలుగు సినిమాలే చూడడని చెప్పుకొచ్చాడు. అదీ మ్యాటర్.

ఏదేమైనా.. రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడడం చాలా హ్యాపీ. ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ‘మేము వచ్చేశాము.. MI ఫ్యాన్స్ పదండి ఉప్పల్‌కు’ అని చెప్పిన మాటలను ట్విటర్‌లో పెట్టారు. రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడాడంటూ ఆ వీడియోను ఫ్యాన్స్ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×