BigTV English

Gold Specialities: బంగారం గురించి ఆసక్తికర విషయాలు.. చదివితే ఆశ్చర్యపోతారు..

Gold Specialities: బంగారం గురించి ఆసక్తికర విషయాలు.. చదివితే ఆశ్చర్యపోతారు..
gold special

Gold Specialities: పసిడి భూగోళంలో ఉద్భవించిన లోహం కాదు. 200 మిలియన్ సంవత్సరాల క్రితం భారీ ఉల్కలు భూమిని ఢీకొట్టిన ఫలితంగా వచ్చింది.


–స్వర్ణానికి సన్నగా, సాగే గుణం ఉంటుంది. ఆభరణాల తయారీకి అనువైన లోహం. అందుకే రోడియం, ప్లాటినం తదితర విలువైన, అరుదైన లోహాలున్నా కనకానికే క్రేజ్ ఎక్కువ. 28.3 గ్రాముల బంగారాన్ని సన్నటి తీగలా సాగదీస్తే 8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. లేదంటే 100 చదరపు అడుగుల రేకులా అణగగొట్టొచ్చు.

–రాజులు, నవాబులు బంగారంను ఆహారంలో తీసుకునేవారు. స్వచ్ఛమైన స్వర్ణం ఎంతమాత్రమూ విషపూరితం కాదు. మన జీర్ణవ్యవస్థ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. తుప్పుపట్టని లోహాల్లో ఇదొకటి.


–మన శరీరంలోనూ పసిడి ఉంటుంది. 70 కిలోల సగటు బరువున్న మనిషిలో 0.2 మిల్లీ గ్రాముల బంగారం ఉంటుంది. మంచి విద్యుత్తు వాహకమైనందున.. శరీరం అంతటికీ విద్యుత్తు సంకేతాలను పంపడంలో బంగారం ఉపయోగపడుతుంది.

–బంగారం ఆభరణాలకే కాదు.. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. కంప్యూటర్లు, టెలివిజన్లు, కెమెరాలు, రేడియోలు, మీడియా ప్లేయర్ల తయారీకి ఉపయోగపడుతుంది.

–భూమిలో నిక్షిప్తమైన బంగారం దాదాపు 53 వేల టన్నులు. సముద్ర జలాల్లోనూ పుత్తడి ఉంది. దానిని లెక్కించడం క్లిష్టం. నార్త్ పసిఫిక్, అట్లాంటిక్ సముద్రజలాలు ప్రతి 100 మిలియన్ మెట్రిక్ టన్నులకు ఒక గ్రాము బంగారం లభిస్తుందని ఓ అంచనా. ఇక సముద్రం అట్టడుగున కూడా పసిడి ఉంటుంది కానీ వెలికితీత చాలా కష్టం.

–పురాతన కాలం నుంచీ బంగారం వినియోగంలో ఉంది. బల్గేరియాలో 6 వేల ఏళ్ల నాటి స్వర్ణ కళాకృతులు వెలుగుచూశాయి.

–పసిడి ఉత్పత్తిలో చైనాది అగ్రస్థానం. ఏటా 370 టన్నుల ఉత్పత్తి జరుగుతుంటుంది. ఆ దేశంలో వినియోగమూ ఎక్కువే.

–బంగారం అన్నా.. స్వర్ణభరణాలను చూసినా కొందరు భయపడుతుంటారు. దానిని ఆరోఫోబియా అంటారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×