E-Paper
Advertisement

Shoaib Akhtar: ఛీ ఛీ..న‌ఖ్వీ లాంటి ద‌ద్ద‌మ్మ వల్లే ఓట‌మి..అంద‌రూ కట్టగట్టుకుని బావిలో దూకేయండి

Shoaib Akhtar: ఛీ ఛీ..న‌ఖ్వీ లాంటి ద‌ద్ద‌మ్మ వల్లే ఓట‌మి..అంద‌రూ కట్టగట్టుకుని బావిలో దూకేయండి
Advertisement

Shoaib Akhtar: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament)  భాగంగా పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచి ఓడిపోయింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది పాకిస్తాన్. అయితే ఇండియా చేతిలో పాకిస్తాన్ నిన్న ఓడిపోయిన నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. పాకిస్తాన్ పరువు తీసేలా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ డేంజర్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్ ఓటమికి ముఖ్య కారణం మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) అంటూ ఫైర్ అయ్యారు. క్రికెట్ అంటే తెలియని వాడికి చైర్మన్ బాధ్యతలు ఇచ్చారని.. ఆ దరిద్రం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చిందని నిప్పులు చెరిగారు షోయబ్ అక్తర్. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

న‌ఖ్వీ లాంటి ద‌ద్ద‌మ్మ వల్లే ఓట‌మి..అంద‌రూ కట్టగట్టుకుని బావిలో దూకేయండి

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు అందరూ స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా స్పందించారు. పాకిస్తాన్ ప్రస్తుత క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ న‌ఖ్వీ కారణంగానే ఈ అవమానకరమైన ఓటమి చవిచూశారని మండిపడ్డారు. మొక్సిన్ న‌ఖ్వీకి రాజకీయాలు తప్ప క్రికెట్ గురించి ఒక్క విషయం కూడా తెలియదని మండిపడ్డారు.

బహిష్కరణ అంటూ ముందు డ్రామాలు ఆడి.. ఇప్పుడు ఇండియాతో ఓటమి చవిచూసేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూపర్ స్టార్ అని పిలుచుకునే బాబర్ ఆజం ఐదు పరుగులకే ఔట్ అయ్యాడని నిప్పులు చెరిగారు. ఇలాంటి వెధ‌వ క్రికెటర్లను పెట్టుకుంటే పాకిస్తాన్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఓ చిన్న పిల్లాడిని కొట్టినట్లుగా పాకిస్తాన్ జట్టును ఒక ఆట ఆడుతుందని, చివరికి ఓడిపోయేలా టీమ్ ఇండియా స్కెచ్ వేసిందని వెల్లడించారు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా ఆడి విజయం సాధించిందని గుర్తు చేశారు. ఇక‌ న‌ఖ్వీతో పాటు అంద‌రూ కట్టగట్టుకుని బావిలో దూకేయండి అంటూ చుర‌క‌లు అంటించారు అక్త‌ర్‌.

పాకిస్తాన్ కు అగ్నిపరీక్ష

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ కు అగ్నిపరీక్ష ఎదురుకానుంది. సూపర్ 8 లోకి వెళ్లి అవకాశాలను పాకిస్తాన్ చేజేతుల పోగొట్టుకుంది. ఫిబ్రవరి 18వ తేదీన నమీబియాతో కచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఒకవేళ నమీబియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సిందే. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు సూపర్ 8లోకి వెళుతుంది.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

 

 

Related News

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అడ్డంకి !

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

Big Stories

Advertisement
×