BigTV English

Ayodhya : జీవితంలో గుర్తుండిపోయే రోజు.. శ్రీరాముడి ప్రాణప్రతిష్టపై దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్ పోస్ట్..

Ayodhya : అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెటర్‌ కేశవ్ మహరాజ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమానికి పలువురు ఆటగాళ్లకు ఆహ్వానాలు అందాయి. విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ఆటగాళ్లూ ఈ వేడుకపై స్పందించారు.

జై శ్రీ రామ్ అంటూ.. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుందని కేశవ్ మహరాజ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అందరిలోనూ శాంతి, సామరస్యం,ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలన్నారు.

భారత్ ఇటీవల సఫారీల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీరాముని పాటలు వినిపించాయి. అప్పుడు కేశవ్ స్పందిస్తూ.. తాను ఎప్పుడు మైదానంలోకి దిగినా ఇలాంటి పాటలు వినిపించేలా చేశారని ఆనందం వ్యక్తం చేశాడు.

క్రికెట్‌ దిగ్గజాలతో పాటు ప్రస్తుత క్రికెటర్లకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. ఇప్పటికే వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ దంపతులు, సచిన్‌ తెందూల్కర్ అయోధ్యకు చేరుకున్నారు. వీరికే కాకుండా ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, హర్మన్‌ ప్రీత్‌ కౌర్, మిథాలీ రాజ్‌, రవిచంద్రన్ అశ్విన్‌కు ఆహ్వానాలు అందాయి. పార్టీలకు అతీతంగా ఈ వేడుకలకు హాజరు కావాలని.. తానూ దీనిలో పాల్గొంటానని హర్భజన్‌ సింగ్‌ ఇటీవలే స్పష్టం చేశాడు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×