Vaibhav Sooryavanshi: శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ (Tri Nation A Series in Sri Lanka 2026 ) నేపథ్యంలో అందరూ ఊహించినట్లుగానే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) ఫైనల్స్ లో ఇరగదీశాడు. మొన్న లంక లిస్ట్ ఏ క్రికెటర్లు రెచ్చగొడితే… రెచ్చిపోయిన వైభవ్… గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని అందరూ ట్రోలింగ్ చేశారు. అయితే ట్రోలింగ్ చేసిన వాళ్లకు తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా లిస్ట్ (Sri Lanka A vs India A, Final) జట్ల మధ్య దంబుల్లా (Rangiri Dambulla International Stadium, Dambulla) వేదికగా ఇవాళ ఫైనల్ జరిగింది. ఇందులో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయక వైభవ్ సూర్య వంశీ 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. దీంతో సోషల్ మీడియాలో వైభవ్ సూర్య వంశీ పేరు మారుమోగుతోంది.
ట్రై సిరీస్ ఫైనల్స్ లో సెంచరీ మిస్ చేసుకున్న వైభవ్ సూర్యవంశీ, డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్లు ఈ సారి ర్యాగింగ్ చేయకుండా.. అతని మెచ్చుకున్నారు. శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా అయితే వైభవ్ దగ్గరికి వెళ్లి అతని ప్రశంసించాడు. మిగతా ప్లేయర్లు కూడా వైభవ్ ఇన్నింగ్స్ కు ఫిదా అయిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు వైభవ్ సూర్యవంశీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎవడైతే తిట్టాడో.. వాళ్లతోనే ప్రశంసలు అందుకున్నాడని మెచ్చుకుంటున్నారు. ఇండియన్ క్రికెటర్లతో పెట్టుకుంటే, ఇలాగే ఉంటుందని కౌంటర్లు ఇస్తున్నారు.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇవాళ జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్స్ లో (Tri Nation A Series in Sri Lanka 2026 ) అద్భుతంగా రాణించాడు. మొన్న శ్రీలంక ప్లేయర్లు రెచ్చగొట్టగా.. దానికి ప్రతి కారం తీర్చుకున్నాడు. 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు వైభవ్. 300కు పైగా స్ట్రైక్ రేట్ సంపాదించిన వైభవ్ సూర్యవంశీ, లంక బౌలర్లకు నరకం మీనింగ్ రాయించాడు. ఇక ఇందులో ఎనిమిది సిక్సర్లు అలాగే 10 బౌండరీలు ఉన్నాయి. ఇందులో అద్భుతంగా రాణించిన వైభవ్ 11 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసుకొని.. లిస్ట్ ఏ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు 22 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన రికార్డు ఇషాన్ కిషన్ (Ishan Kishan) పేరు పైన ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలు కొట్టాడు.
THE AURA OF 15 YO SOORYAVANSHI.🔥
From mocking to congratulating – Vaibhav Sooryavanshi answered with his blistering knock of 94.
Sri Lankan players congratulating Vaibhav Sooryavanshi.👀 pic.twitter.com/z3BR15wlkx
— Maina Singh (@Maina_Singhx77) June 21, 2026