E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ట్రంప్‌కు ఇటలీ ప్రధాని మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్.. మీ సంగతి చూసుకోవాలని సూచన, అసలేం జరిగింది?

ట్రంప్‌కు ఇటలీ ప్రధాని మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్.. మీ సంగతి చూసుకోవాలని సూచన, అసలేం జరిగింది?
Advertisement

Meloni Vs Trump: అగ్రరాజ్యం అమెరికా అందరితో గిల్లికజ్జాలు పెట్టుకుంటుందా? ఏదో విధంగా అందర్ని కెలికే ప్రయత్నం అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నారా? ఇటలీ ప్రధానిపై ఎందుకు నోరు పారేసుకున్నారు? ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌కు ట్రంప్ నోరెత్తుతారా? లైట్‌గా తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఈ వ్యవహారంలో  ఐరోపా-అమెరికా మధ్య విభేదాలు తలెత్తాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ట్రంప్‌కు ఇటలీ ప్రధాని మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌-ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. జీ-7 సదస్సుల్లో అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సోషల్‌ మీడియాలో ట్రంప్‌కు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్.. మీరు పదే పదే అనవసరమైన విమర్శలు చేస్తున్నారని రాసుకొచ్చారు.

నా ప్రజాదరణ మీ ప్రశంసలు,అండదండలపై ఏమాత్రం ఆధారపడి ఉండదన్నారు. ఇటలీ దేశ ప్రయోజనాలను కాపాడటమే నా బాధ్యత అని, అదే చేస్తున్నానని తెలిపారు. ఇటలీ ప్రజలు తనపై విశ్వాసం ఉంచుతున్నారని ప్రస్తావించారు. అయినా నా ఆదరణ గురించి మీకెందుకు? ముందు మీ సంగతి చూసుకోవాలంటూ ఆమె బదులిచ్చారు.

Advertisement

మీ సంగతి చూసుకోవాలంటూ ట్రంప్‌కు మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్

ఇటలీలో అమెరికా సైనిక స్థావరాలు ఇరుదేశాల మధ్య ఒప్పందాల ప్రకారమే కొనసాగుతున్నాయని తేల్చిచెప్పారు. ఆ ఒప్పందాలను ఇటలీ గౌరవిస్తుందని, భవిష్యత్తులో గౌరవిస్తూనే ఉంటుందన్నారు. ఇటలీ ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశమని గుర్తు చేశారు.

పారిస్‌లో జరిగిన జీ-7 సదస్సులో ఇటలీ ప్రధాని మెలోనీ తనతో ఫొటో దిగటానికి ప్రాధేయపడ్డారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇటలీలో కోల్పోయిన ప్రజాదరణను తిరిగి పెంచుకునేందుకే తనతో స్నేహం చేస్తున్నట్లు మెలోనీ ప్రయత్నించారని ట్రంప్‌ ప్రత్యారోపణ చేశారు.

ALSO READ: ఇరాన్-అమెరికా యుద్ధం మొదలు.. హార్మూజ్‌ జలసంధి మూసివేత, ఇరాన్‌కు ట్రంప్ కొత్త అల్టిమేటం! 

ఈ విషయంలో ఆమెతో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, ఇటలీలో ప్రజాదరణను కోల్పోతున్న మెలోనీ పరిస్థితి ఏమీ బాగా లేద్నారు. అందుకే ఆమె ఈ తరహా ఎత్తుగడలు వేస్తున్నారని, తనతో ఫొటో కోసం ఆమె ప్రాధేయపడ్డ మాట నిజమంటూ పునరుద్ఘాటించారు. ఇరాన్ యుద్ధం విషయంలో ఐరోపాలోని కొన్ని దేశాలు అమెరికాకు మద్దతు తెలపలేదు.

స్పెయిన్, ఇటలీతోపాటు పలు దేశాలు ఉన్నాయి. ఇటలీని ప్రేమించి రక్షణగా నిలిచే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నందునే ఆమెకు స్వదేశంలో ప్రజాదరణ తగ్గిపోతోందంటూ చురకలు వేశారు ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటుగా ప్రతిస్పందించారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ట్రంప్ అందరితో గిల్లికజ్జాలు పెట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

Related News

ఇరాన్-అమెరికా యుద్ధం మొదలు.. హార్మూజ్‌ జలసంధి మూసివేత, ఇరాన్‌కు ట్రంప్ కొత్త అల్టిమేటం!

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

నెతన్యాహుపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. ‘నేనే లేకపోతే ఇజ్రాయెల్ సర్వనాశనమయ్యేది’

సుందర్ పిచాయ్‌ కి షాక్.. ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్!

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!

సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 130 అడుగుల ఎత్తు నుంచి యువతిని తోసేసి..

ఎట్టకేలకు యుద్ధం ముగిసింది.. ఇరాన్-అమెరికా మధ్య డీల్, ట్రంప్ కీలక ప్రకటన, జలసంధి ఓపెన్

Big Stories

×