BigTV English

T20 World Cup 2024 Four Finalist Teams: ఇవిగో.. ఆ నాలుగు ఫైనలిస్టు జట్లు..! జోస్యం చెబుతున్న సీనియర్లు..

T20 World Cup 2024 Four Finalist Teams: ఇవిగో.. ఆ నాలుగు ఫైనలిస్టు జట్లు..! జోస్యం చెబుతున్న సీనియర్లు..

Sunil Gavaskar and Brian Lara Picks Their Four Semifinalists of T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ ఫీవర్ మొదలైంది. అప్పుడే అమెరికాలో టీమ్ ఇండియా ప్రాక్టీస్ షురూ చేసేసింది. అయితే సీనియర్లు అందరూ ఏ జట్లు ఫైనల్స్ కి వస్తాయో.. అంచనాలు వేస్తున్నారు. అందులో ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా దగ్గర నుంచి చాలామంది ఉన్నారు. మరి వారి లెక్కలేమిటో ఒకసారి చూసేద్దాం.


అయితే ఆగండాగండి.. మీరు కూడా ఒక నిమిషం కళ్లు మూసుకుని.. మీ అంచనాలను ఒక కాగితంపై రాసుకోండి. లేదా మనసులో అనుకోండి. ఎందుకంటే మీరు కూడా ఈపాటికి ఒక అంచనాకి వచ్చేసే ఉంటారు కదా.. అప్పుడు సీనియర్లు చెప్పిన జట్లతో పోల్చి చూసుకోండి. మీది కరెక్టు అనుకోండి. మీకు మంచి క్రికెట్ పరిజ్ణానం ఉందని లెక్క అన్నమాట. అంటే మీ బుర్ర…క్రికెట్ ఆడి తలపండిపోయిన సీనియర్ క్రికెటర్లతో సమానంగా ఉందని అర్థం.. ఓకేనా.. ఒకసారి కళ్లు మూసుకోండి. రాసుకోండి.. మననం చేసుకోండి.. ఇప్పుడు చూడండి.

టీమ్ ఇండియా ఉద్దండ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పిన ఆ నాలుగు జట్లు ఏవిటంటే.. భారత్,  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్,


బ్రియాన్ లారా: భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా
కాలింగ్ వుడ్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్
మ్యాథ్యూ హెడెన్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
మహ్మద్ కైఫ్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్
అంబటి రాయుడు: భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా
క్రిస్ మోరిస్: భారత్, ఇంగ్లాండ్,  ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
ఆరోన్ ఫించ్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్
శ్రీశాంత్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్
టామ్ మూడి: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
ఇయాన్ బిషప్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్
నజీర్ హుస్సేన్: భారత్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్

Also Read: టీ 20 ప్రపంచకప్ పోటీల వేళలు ఇవే..

వీరు కాకుండా కొన్ని సోషల్ మీడియా నెట్ వర్కులు, ఆయా ఫ్లాట్ ఫారాల మీద నెటిజన్ల పోల్ తీసుకుని చేసినవి ఉన్నాయి. అవేమి చెబుతున్నాయంటే.. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పేర్లు చెబుతున్నాయి. న్యూజిలాండ్ వచ్చినా రావచ్చుని అంచనా వేశాయి.

అయితే, ఇక్కడ పలువురు సీనియర్లు.. టీ 20 ప్రపంచకప్ లో సెమీఫైనల్ కు ఎవరు చేరుతారో తమ అంచనాలను చెప్పారు. వీరిలో అందరూ కామన్ గా చెప్పిన రెండు పేర్లున్నాయి. చూశారా..
1. ఇండియా 2. ఇంగ్లాండ్…

తర్వాత 15 మందిలో  అధికశాతం ఆస్ట్రేలియాకి మొగ్గు చూపారు. తర్వాత తమ ప్రయార్టీ దక్షిణాఫ్రికా కి ఇచ్చారు. ఆ తర్వాత వెస్టిండీస్ పేరు చెప్పారు. కేవలం ఇద్దరు మాత్రమే పాకిస్తాన్ పేరు చెప్పారు. ఇద్దరు న్యూజిలాండ్ పేరు చెప్పారు.

ఓవరాల్ గా చూస్తే ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వీటి మధ్యే పోటీ ఉంటుందనేది అర్థమవుతోంది.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×