Suryakumar Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇలాంటి తరుణంలో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ( suryakumar yadav) తండ్రయ్యాడు. పెళ్లి అయిన దాదాపు పది సంవత్సరాల తర్వాత సూర్య కుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి ( Devisha Shetty) ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మే 7వ తేదీన అంటే నిన్న సూర్య కుమార్ యాదవ్ తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సూర్యకుమార్ యాదవ్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నవ్వులు, విల్లులు, కలలతో కూడిన మా చిన్నారిని ఆహ్వానిస్తున్నామంటూ క్యాప్షన్ ఇచ్చారు. సూర్య కుమార్ యాదవ్ దంపతులు చేసిన ఈ ప్రకటనపై.. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !
ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తండ్రి ( Suryakumar Yadav becomes father) అయిన నేపథ్యంలో రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ( Rohit Sharma) ప్రకటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సరైన ప్రదర్శన లేక హార్దిక్ పాండ్యాను ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ పక్కకు పెట్టింది. గత మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించి మ్యాచ్ గెలిపించాడు. ఇక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ తండ్రైన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కు దూరం కాబోతున్నాడట. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తో ముంబై ఇండియన్స్ మధ్య ఫైట్ ఉంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్ గా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. ఈ న్యూస్ బయటకు రావడంతో… సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) తండ్రి కావడం.. రోహిత్ శర్మకు కలిసి వచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఈనెల 10వ తేదీన మ్యాచ్ జరగనుంది. రాయపూర్ వేదికగా ఆదివారం సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇప్పటికే ముంబై ఇండియన్స్ సభ్యులందరూ రాయపూర్ చేరుకున్నారు. అక్కడి వాతావరణం లో తనివి తీరుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్ జట్టుతో సూర్యకుమార్ యాదవ్ అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా వెళ్లలేదు. ముంబైలోనే ఉన్నారు. హార్దిక్ పాండ్యా పై ముంబై ఇండియన్స్ యాజమాన్యం వే టు వేయగా.. సూర్య కుమార్ యాదవ్ మాత్రం తండ్రి అయిన నేపథ్యంలో ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారని అంటున్నారు.
Suryakumar Yadav and his wife Devisha Shetty have been blessed with a baby girl.
Many congratulations to them.❤️☺️ pic.twitter.com/tkh0wQKAJd
— Indian Cricket (@IPL2025Auction) May 7, 2026