BAN vs WI: బంగ్లాదేశ్ – వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా తొలి టీ-20 లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. చత్తోగ్రామ్ వేదికగా అక్టోబర్ 27న జరిగిన తొలి టీ-20 లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఓపెనర్లు బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అలిన్ అథనజే {34}, బ్రాండన్ కింగ్ {33} మంచి శుభారంభం అందించారు. అనంతరం షాయ్ హోప్ {46*} రోమన్ పావెల్ {44*} ధనాధన్ ఇన్నింగ్స్ తో చెలరేగారు. దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీ వద్దకు తరలించారు. వీరిద్దరి విధ్వంసంతో బంగ్లాదేశ్ ముందు ఓ మోస్తరు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది వెస్టిండీస్.
Also Read: Cricketers Toilet: బ్యాటింగ్ చేసేటప్పుడు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే ఎలా.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే
నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, రిషద్ హుస్సేన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 166 పరుగుల లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ ఓ మోస్తరు పోరాటం చేసి చేతులెత్తేసింది. 19.4 ఓవర్లలో 149 పరుగులకే ఆల్ అవుట్ అయింది. లక్ష్య చేదనకు మరో 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ 3, జేసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టి ఆతిధ్య జట్టు బ్యాటర్లను ఒత్తిడిలో పడేశారు. తౌహీద్ హృదయ్ 28, తంజిమ్ హసన్ 33 పరుగులతో జట్టును గెలిపించేందుకు పోరాడారు. కానీ వారికి సహకరించే వారు కరువయ్యారు.
క్రికెట్ లో చివరి ఓవర్ లో డ్రామా మామూలే. బంతిని బౌండరీ అవతలికి సిక్సర్ గా పంపి.. జట్టు విజయ అవకాశాలపై ఆశలు రేపుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చివరి ఓవర్ చివరి మూడు బంతుల్లో బంగ్లాదేశ్ కి వరుసగా మూడు సిక్సర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో క్రీజ్ లో ఉన్న బ్యాట్స్మెన్ సిక్స్ బాదాడు. కానీ అంపైర్ మాత్రం దానిని అవుట్ గా ప్రకటించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ విజయం అంచుల దాకా వచ్చి బోల్తా పడింది. లక్ష్య చేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభం నుండి వికెట్లు కోల్పోతూ వచ్చింది. 18 ఓవర్ లో 9వ వికెట్ కూడా కోల్పోయింది. అలాంటి పరిస్థితులలో క్రీజ్ లో ఉన్న తస్కిన్ అహ్మద్, ముస్తఫీజుర్ రెహమాన్ జట్టును గెలిపించేందుకు పోరాడుతున్నారు. ఇద్దరూ 19 ఓవర్ లో జట్టు స్కోరును 146 పరుగులకు చేర్చారు.
చివరి ఓవర్ లో 20 పరుగులు అవసరం ఉండగా.. రొమారియో షెఫర్డ్ వేసిన మొదటి మూడు బంతుల్లో ఒక వైడ్ తో సహా బంగ్లా జట్టుకు మూడు పరుగులు లభించాయి. ఈ క్రమంలో చివరి మూడు బంతుల్లో 17 పరుగులు అవసరం. ఇక బంగ్లా జట్టు గెలవాలంటే మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కావాలి. షెఫర్డ్ నాలుగవ బంతి వేయగానే క్రీజ్ లో ఉన్న తస్కిన్ బ్యాక్ ఫుట్ లోకి వెళ్లి బంతిని గాల్లోకి కొట్టాడు. ఆ బంతి డీప్ మిడ్ వికెట్ బౌండరీ అవతల పడింది.
Also Read: IPL 2026: కేకేఆర్ ప్లాన్ మాములుగా లేదు… ముగ్గురు డేంజర్ ప్లేయర్లను దించుతున్నారుగా !
ఆ సందర్భంలో బంగ్లా అభిమానులు సంబరాలు చేసుకునేలోపే.. అంపైర్ తస్కిన్ ని అవుట్ గా ప్రకటించాడు. ఎందుకంటే అతడు బ్యాక్ ఫుట్ లోకి అంత వెనక్కి వెళ్లి షార్ట్ ఆడడంతో అతని కాలు స్టంప్ కి తగిలి బెయిల్స్ కింద పడిపోయాయి. ఈ క్రమంలో తస్కిన్ హిట్ వికెట్ ద్వారా అవుట్ అయ్యాడు. ఈ విధంగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ అక్కడితో ముగిసిపోయింది. ఇక ఈ సిరీస్ లోని రెండవ టి-20 ఇదే వేదికగా అక్టోబర్ 29న జరగబోతోంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">