Womens World Cup 2025: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లన్ని దాదాపు పూర్తయ్యాయి. ఎల్లుండి నుంచి సెమీ ఫైనల్ పోరు కూడా ప్రారంభం కానుంది. అయితే నిన్న ఈ టోర్నమెంట్ లో భాగంగా మహిళల టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య గ్రూప్ స్టేజి మ్యాచ్ జరిగింది. , నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ( Dr DY Patil Sports Academy, Navi Mumbai ) జరిగిన ఈ మ్యాచ్ లో వర్షం అడ్డంకిగా మారగా, ఈ నేపథ్యంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలోనే ఓ జంట రొమాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇండియా మహిళల జట్టు వర్సెస్ బంగ్లాదేశ్ ( India Women vs Bangladesh Women, 28th Match) మధ్య నిన్న 28వ మ్యాచ్ జరగగా వర్షం అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. అయితే వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కాస్త ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్లందరికీ ఓ జంట మంచి వినోదాన్ని ఇచ్చింది. దాదాపు 50 సంవత్సరాలు ఉన్న ఆంటీ తన భర్తతో కలిసి రొమాన్స్ చేసింది.
ఓ హిందీ పాటకు స్టెప్పులు వేస్తూ, ఇద్దరు రెచ్చిపోయారు. ఆ 50 ఏళ్ల ఆంటీ కాస్త లావుగా ఉన్నప్పటికీ, ఏ మాత్రం తగ్గలేదు. అంతమంది ప్రేక్షకుల ముందే భర్తతో తెగ ఎంజాయ్ చేసింది. అయితే వీళ్ళ వీడియోను ఓ వ్యక్తి క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ రద్దు అయినప్పటికీ, స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు మంచి వినోదం లభించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అందరికీ వినోదం పంచడం కూడా మంచి కల అంటున్నారు.
వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025)లో భాగంగా నిన్న జరిగిన టీమిండియా వర్సెస్ బంగ్లా మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేసి, తలో పాయింట్ ఇచ్చింది ఐసీసీ. టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేసే క్రమంలో భారీ వర్షం చోటు చేసుకుంది. దీంతో చేసేది ఏమీలేక, మ్యాచ్ రద్దు చేసినట్లు ప్రకటించారు అంపైర్లు.
?igsh=ZGwwMmZ2MzJ5ZHlx