E-Paper
Advertisement

ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే, వైభ‌వ్ కు మెరుగైన ర్యాంకింగ్స్‌..త‌న్వీర్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే, వైభ‌వ్ కు మెరుగైన ర్యాంకింగ్స్‌..త‌న్వీర్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు
Advertisement

Tanveer Ahmed On Vaibhav ICC Rankings:  టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే తో జరిగిన టి20 సిరీస్ సందర్భంగా రెండు అర్ధ సెంచరీలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీనికి తగ్గట్టుగానే ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ముందుకు దూసుకు వచ్చాడు. దాదాపు 230 స్థానాలు మెరుగుపడ్డ వైభవ్ సూర్యవంశీ 48వ స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

Advertisement

అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ రెచ్చిపోయి కామెంట్ చేశాడు. ఇప్పటికే వైభవ్ పై అనేక ఆరోపణలు చేసిన తన్వీర్ అహ్మద్, ఐసీసీ ర్యాంకింగ్స్ మెరుగు పడడం వెనుక కుట్ర కోణం ఉందని బాంబు పేల్చాడు. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉన్న నేపథ్యంలోనే వైభవ్ సూర్య వంశీకి మెరుగైన ర్యాంకింగ్ వచ్చిందని ఆరోపణలు చేశారు. అతడు ఇండియన్ కాబట్టి.. రెండు అర్థ సెంచరీలు చేయగానే 48వ స్థానాన్ని ఇచ్చారంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే, వైభ‌వ్ కు మెరుగైన ర్యాంకింగ్స్

టి20 ర్యాంకింగ్స్ లో 15 ఏళ్లకు కుర్రాడు వైభవ్ 48వ స్థానానికి రావడం పైన పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వే పైన కేవలం రెండు అర్థ సెంచరీలు చేస్తేనే… వైభవ్ కు మెరుగైన ర్యాంకింగ్ ఇవ్వడం వెనక ఐసీసీ బాస్ జై షా కుట్ర ఉందని ఆరోపణలు చేశారు. ఇండియాకు సంబంధించిన వాడు కాబట్టి వైభవ్ 230 స్థానాలు ఇక బాకీ… 48వ స్థానానికి వచ్చినట్లు ఐసీసీ ప్రకటన చేసినట్లు ఫైర్ అయ్యారు. కేవలం రెండు అర్థ సెంచరీలు చేస్తేనే ఇంత ర్యాంకింగ్ ఇస్తారా ? దీని వెనుక నిజంగానే కుట్ర ఉందని ఆరోపణలు చేశారు. ఇండియన్ క్రికెటర్లకు ఒకలాగా ? విదేశీ క్రికెటర్లకు మరోలాగా న్యాయం ఉంటుందా? అంటూ ఐసీసీ నేలదీశారు. పాకిస్తాన్ క్రికెటర్లు ఎంత బాగా ఆడిన ఐసీసీ బాస్ జై షా పట్టించుకోబోరని బాంబు పేల్చారు.

పాక్ ప్లేయ‌ర్లు వ‌రుస‌గా సెంచ‌రీలు చేసినా..ఐసీసీ ప‌ట్టించుకోదు

Advertisement

చాలా రోజుల నుంచి టి20 క్రికెట్లో పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు తన్వీర్ అహ్మద్. చాలామంది తమ క్రికెటర్లు సెంచరీలు… అర్థ సెంచరీలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. మా వాళ్లు 200 పరుగులు చేసిన కూడా ఐసీసీ పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. వైభవ్ సూర్య వంశీ రెండు అర్థ సెంచరీలు చేసినందుకే, మెరుగైన ర్యాంకింగ్ ఇచ్చి ఐసీసీ కుట్రకు తెరలేపిందని సీరియస్ అయ్యారు. పాకిస్తాన్ ప్లేయర్లు ఎన్ని పరుగులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు అంటూ ఆగ్రహించారు. దీనిపై కచ్చితంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ కు జరిగిన న్యాయం… తమకు జరగడం లేదని ఫైర్ అయ్యారు.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

Related News

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×