E-Paper
Advertisement

Harmanpreet Kaur : సదా ప్రేమతో.. మీ హర్మన్ ప్రీత్ .. అభిమాని వీడియోను షేర్ చేసిన కెప్టెన్ ..

Harmanpreet Kaur : సదా ప్రేమతో.. మీ హర్మన్ ప్రీత్ .. అభిమాని వీడియోను షేర్ చేసిన కెప్టెన్ ..
Advertisement

Harmanpreet Kaur : ‘అది ప్రేమ, అమాయకత్వం కలిసిన క్షణం’ అంటూ టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఒక కొటేషన్ పెట్టి, ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏమిటి? హర్మన్ ఇలా రాసిందని నెటిజన్లు అంతా ఆ వీడియో ఓపెన్ చేసి చూశారు.

తీరా చూస్తే అందులో ఒక పది, పన్నెండేళ్ల అమ్మాయి అదే పనిగా ఏడుస్తోంది. ఒక మహిళ ఎందుకిలా ఏడుస్తున్నావని అడిగితే, తనింకా దు:ఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే తన ఫ్రెండ్స్ అసలు విషయం చెప్పారు. అదేమిటంటే ఇంగ్లాండ్-టీమ్ ఇండియా మధ్య ముంబయి వాంఖేడి స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.

Advertisement

అయితే హైస్కూల్ స్థాయి అమ్మాయిలు కొందరు ఒక గ్రూప్ గా కలిసి తమ ఫేవరేట్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ ను కలిసేందుకు స్టేడియానికి వచ్చారు. కానీ వారికి, ఆ అవకాశం రాలేదు. దాంతో వారు చాలా అప్ సెట్ అయ్యారు. నిజానికి స్టేడియంకి వెళితే ప్లేయర్స్ ని కలవచ్చు. వారితో షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు ఓహో అనుకుంటూ, ఏవేవో ఊహించుకుని గంతులేసుకుంటూ స్టేడియంకి వెళ్లారు. కానీ ఒక్కసారి సీన్ అంతా తలకిందులైపోయేసరికి తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ఎందుకంటే ఈ మ్యాచ్ చూసేందుకు ఎన్నోరోజులు ప్లాన్ చేసి అతికష్టమ్మీద ఇంటి దగ్గర, స్కూల్ దగ్గర పర్మిషన్లు తెచ్చుకొని నానాపాట్లు పడి వెళితే, ఒక్క ప్లేయర్ కూడా వీరికి చిక్కలేదు. రెండోది వారు స్టేడియం నుంచి గ్రౌండ్ లోకి వెళ్లే దగ్గర ఐరన్ మెష్ ఉండటంతో అటువైపు వెళ్లలేకపోయారు. అలాగే ప్లేయర్లు కూడా  మ్యాచ్ మూడ్ లో ఉండటంతో కనీసం వీరి వైపు కూడా చూడకుండా వెళ్లిపోయారు.

Advertisement

ఎన్నో ఊహించుకుని వస్తే, ఆ చిన్నారులకు నిరాశే ఎదురైంది. దీంతో ఒకమ్మాయి భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కన్నీటి పర్యంతమైంది. హర్మన్ ప్రీత్ తన ఫేవరేట్  అని, కలవలేకపోయానని ఏడ్చేసింది. మరోసారి కలుద్దాంలే అని ఆమెని ఫ్రెండ్స్ ఓదార్చారు.

అక్కడే ఉన్న ఒకామె ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే, ఇంకా భోరుమంది.  మొత్తానికి ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అది చూసిన హర్మన్ ప్రీత్ సైతం ఆ చిన్నారుల అభిమానానికి ఫిదా అయ్యింది. తనకోసం ఏడుస్తున్న అమ్మాయిని చూసి ముచ్చటపడింది. ‘ ప్రేమ, అమాయకత్వం కలిసిన క్షణం’ అంటూ ఒక చక్కని క్యాప్షన్  రాసి, తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడిది టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

అయితే చాలామంది ఆ అమ్మాయిని చూసి ఏడవద్దు, ఆటోగ్రాఫ్ పోతే పోయింది…కానీ హర్మన్ ప్రీత్ ప్రేమని, అభిమానాన్ని పొందావు. ఇంతకన్నా కావల్సింది ఏముంది? నువ్వు కాదు, తనే నిన్ను చూసేందుకు తప్పకుండా వస్తుంది చూస్తూ ఉండు..అని ఓదార్చుతూ కామెంట్లు పెడుతున్నారు. అది ఒక అందమైన అనుభవం అని అందరూ కొనియాడుతున్నారు.

.

.

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×