BigTV English

India vs England :  11 ఏళ్లుగా స్వదేశంలో ఓటమెరుగుని టీమ్ ఇండియా..!

India vs England :  11 ఏళ్లుగా స్వదేశంలో ఓటమెరుగుని టీమ్ ఇండియా..!
India vs England

India vs England : 11 ఏళ్లుగా టెస్ట్ సిరీస్ లో భారత్ కి ఓటమి అన్నది లేదు. దీనిని బ్రేక్ చేయాలని ఇంగ్లాండ్ కెప్టెన్  బెన్ స్టోక్స్ చూస్తున్నాడు. ఎందుకంటే భారత్ లో టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుగా ఇంగ్లాండ్ ని నిలబెట్టాలని కలలు కంటున్నాడు. అయితే భారత్ 11 ఏళ్లలో 46 టెస్ట్ లు ఆడి 36 మ్యాచ్ ల్లో గెలిచింది. మూడు మాత్రమే ఓడింది. ఏడు డ్రా చేసుకుంది. ఇదే ఊపులో 2016లో 4-0, 2021లో 3-1 తేడాతో ఇంగ్లాండ్ ని ఓడించింది. అందుకని మరో టెస్ట్ సిరీస్ గెలిచి, సంప్రదాయాన్ని నిలబెట్టాలని రోహిత్ సేన చూస్తోంది.


భారత్ లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ 15 టెస్ట్ సిరీస్ లు ఆడింది. అందులో నాలుగింట్లో గెలిచింది. 8 సిరీస్ లను ఓడిపోయింది. మూడింటిని డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు మాత్రం మంచి దూకుడు మీద ఉంది. పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కాకపోతే పాకిస్తాన్ ఇప్పుడు ఘోరంగా విఫలం కావడంతో, దానినేమాత్రం సీరియస్ గా తీసుకోనవసరం లేదని కొందరు సీనియర్లు అంటున్నారు.

ఇంగ్లాండ్ బ్యాటర్లు రూట్, స్టోక్స్. బెయిర్ స్టో, లారెన్స్, పోప్, క్రాలీ, డకెట్, పోక్స్ పేసర్లు అట్కిన్సన్,  రాబిన్సన్, మార్క్ వుడ్ ఇంకా స్పిన్నర్లు టామ్ హార్ట్ లీ, జాక్ లీచ్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ లతో గట్టిగానే ఉంది.


సీనియర్ ఆటగాడు రూట్ భారత్ లో 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 952 పరుగులు చేశాడు. అంతేకాదు తను స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. అలా 8 వికెట్లు కూడా తీశాడు. ఇప్పుడు వచ్చినవారిలో పలువురికి భారత్ లో ఆడిన అనుభవం ఉంది. అందువల్ల వారందరూ ప్రభావితం చేయగలరని భావిస్తున్నారు. అయితే వయసురీత్యా ఎక్కువ కావడంతో, ముందున్నంత ప్రభావవంతంగా ఆడలేరని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఇంగ్లాండ్ మాత్రం ఈసారి ఆషామాషీగా రావడం లేదని భారత జట్టుని హెచ్చరిస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×