SRH -IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} ప్రపంచంలో 2026 ఐపీఎల్ సీజన్ కి ముందు ఊహించని సంఘటనలకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతున్నాయి. ప్రతి సీజన్ కి ముందు ఆటగాళ్ల మార్పిడి, వేలంపాటలో కొత్త ఆటగాళ్ల రాక, జట్ల వ్యూహాలు కొత్త అనుభూతులను అందిస్తాయి. అయితే 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఇప్పుడు ఓ వార్త సంచలనంగా మారింది. ఇది సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ చేదు వార్త అనే చెప్పాలి. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్ 2026 ఐపీఎల్ కోసం ఓ పెద్ద స్కెచ్ వేసినట్లు ఈ వార్త వైరల్ అవుతుంది.
Also Read: IND VS SA: ఇంతకీ ఈ చిన్నారి ఎవరు.. వరల్డ్ కప్ లో ఎందుకు వైరల్ అయింది?
దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ కి షాక్ ఇచ్చింది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. 2026 ఐపీఎల్ యాక్షన్ కి ముందు క్లాసెన్ ని రిలీజ్ చేసేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైనట్లు సమాచారం. క్లాసెన్ గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడని, టి-20 లలో పెద్ద ప్రభావం చూపించలేకపోతున్నాడని యాజమాన్యం భావిస్తుందట. ఈ కారణంగానే అతడిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన వెలువడలేదు. క్లాసెన్ తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఎంతో ఇష్టమైన ఆటగాడిగా పేరుగాంచాడు. ఇతడు స్పిన్ ని ఎదుర్కొనే సామర్థ్యం, దూకుడైన ఆటతీరు క్రీడాభిమానులకు ఎంతగానో ఇష్టం. ఈ క్రమంలో క్లాసెన్ వంటి ఆటగాడిని వదులుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు.
ఈ ఏడాది జూన్ నెలలో అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. 33 ఏళ్ల వయసులోనే ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన క్లాసెన్.. తన ఏడేళ్ల కెరియర్ లో సౌత్ ఆఫ్రికా తరఫున కీలక పాత్ర పోషించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్ తో పాటు ఇతర ప్రముఖ క్రికెట్ లీగ్ లలో ఆడడం కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున కీలక ఆటగాడిగా కొనసాగాడు.
2025 ఐపీఎల్ సీజన్ లో కలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన తమ చివరి మ్యాచ్ లో క్లాసెన్ కేవలం 39 బంతుల్లో ఏడు ఫోర్లు, 9 ల సాయంతో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ లో క్లాసెన్ కి ఇది రెండవ సెంచరీ. గత సీజన్ లో 14 మ్యాచులు ఆడిన క్లాసెన్ 172.70 స్ట్రైక్ రేట్ తో 487 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై పలికి సౌత్ ఆఫ్రికా క్రీడాభిమానులను నిరాశకు గురిచేసిన క్లాసెన్.. తన కుటుంబం, ఫ్రాంచైజీ క్రికెట్ కెరీర్ పై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే ఇంత అద్భుతమైన ఆటగాడిని SRH వదులుకోబోతుందని తెలిసిన తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
🚨 NO KLASSEN IN SRH 🚨
– Sunrisers Hyderabad is likely to release Heinrich Klassen ahead of the IPL 2026 auction. (Sahil Malhotra/TOI). pic.twitter.com/CpUzmCLc6k
— Tanuj (@ImTanujSingh) November 4, 2025