RCB: క్రికెట్ అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Women’s Premier League 2026) సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. కొత్త సంవత్సరంలోనే మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అంటే జనవరి ఆరవ తేదీన లేదా జనవరి 8వ తేదీన 2026లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026) జనవరి 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో మెగా వేలంపై దృష్టి పెట్టాయి ఫ్రాంచైజీలు. ఈ ఏడాది నవంబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం నిర్వహించనున్నారు. వచ్చే సంవత్సరం టీ20 వరల్డ్ కప్ మన ఇండియాలో జరగనుంది.
ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పురుషుల ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి లోపే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పూర్తి చేసుకోవాలని ఈ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నవంబర్ లో మెగా వేలం నిర్వహించి జనవరి ఆరవ తేదీ నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026) ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ టోర్నమెంట్ పూర్తయ్య చాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
WPL 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ మహిళల జట్టు ( RCB Team ) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తమ కోచింగ్ స్టాఫ్ లో కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కొత్త హెడ్ కోచ్ ను తీసుకువచ్చింది. తమిళనాడు మాజీ క్రికెటర్ మలోలన్ రంగరాజన్ ( Malolan Rangarajan) ను హెడ్ కోచ్ గా నియామకం చేసింది బెంగళూరు యాజమాన్యం ( Royal Challengers Bengaluru). మొన్నటి వరకు ఉన్న హెడ్ కోచ్ ల్యూక్ విలియమ్స్ బిగ్ బ్యాష్ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఎడిషన్ కు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే ల్యూక్ విలియమ్స్ స్థానంలో మలోలన్ రంగరాజన్ ( Malolan Rangarajan) ను తీసుకువచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. బౌలింగ్ కోచ్ గా అన్యా ష్రబ్‌సోల్‌ను ( Anya Shrubsole) నియమించింది ఆర్‌సిబి.
🚨 WPL Mega Auction set for November 27, teams to reveal retentions by November 5! 🤩#CricketTwitter Via: Sportstar pic.twitter.com/FvmAr9oTiP
— Female Cricket (@imfemalecricket) November 4, 2025