BigTV English

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

War 2Twitter Review  : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

War 2Twitter Review : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన మొదటి మూవీ వార్ 2.. ఈ మూవీని చూసేందుకు గత కొన్ని నెలలుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వార్ 2 వచ్చేసింది. ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. వార్ 2 మూవీకి తెలుగుతో పెద్ద ప్రమోషన్స్ చేయకున్నా కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి. ఇవాళ ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ట్విట్టర్‌లో వార్ 2 మూవీ గురించి ఎలాంటి పోస్టులు వస్తున్నాయి..? సెలబ్రిటీలు ఏమంటున్నారు..? ట్విట్టర్ రివ్యూలో ఒకసారి చూసేద్దాం…


ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌కు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఆల్‌ ద బెస్ట్ చెప్పారు. ఒకే తెరపై రెండు పవర్‌హౌస్‌లు కలిసి రావడం ఇది కేవలం సినిమా కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇది ఒక అనుభవం అవుతుందని ఆయన ట్వీట్ చేశారు.. ఎన్టీఆర్ పవర్ హౌస్ నుంచి హృతిక్ రోషన్ చరిష్మా వరకు ఈ కాంబినేషన్ ప్యూర్ మ్యాజిక్ అన్నారు. వీరిద్దరి హర్డ్ వర్క్, ప్యాషన్, అంకితభావం ఈ మూవీ భారీ విజయాన్ని అందిస్తుంది. అని రిషబ్ట్వీట్ చేశారు.

ఇది యుద్ధం..థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్ 2 సినిమా గురించి గర్వంగా ఉంది. ఈ ఎంటర్‌టైనర్‌పై మీ రియాక్షన్స్ చూసేందుకు వేచి ఉండలేను. మీకు దగ్గరలో ఉండే హిందీ, తెలుగు, తమిళ భాషల్లో టికెట్ బుక్ చేసుకుని చూసేయండి.. అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మొత్తానికి ట్వీట్ వైరల్ అవుతుంది.

 

మరో నెటిజన్ మూవీ బ్లాక్ బాస్టర్ పక్కా.. ఫస్ట్ హాఫ్ సూపర్ అని ట్వీట్ చేశారు..

 

 

పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తోపాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ మ్యాజిక్ చేసింది. డ్యాన్స్ సీక్వెన్స్ అదిరిపోయింది. అయితే కథలో దమ్ము లేదు. పేలవంగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. కియారా అద్వానీ గ్లామర్ షో బాగుంది. చివరి 25 నిమిషాలు మూవీ క్లైమాక్స్ అదిరిపోయిందని ట్వీట్ చేశారు..

 

వార్ 2 సినిమా చూశాను. విజువల్‌గా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ నోరెళ్లబెట్టి చూసేలా ఉంటాయి. ప్రతీ ఫ్రేమ్‌లో హృతిక్ చరిష్మా, పవర్ బాగుంది.. ఎన్టీఆర్ ట్విట్టర్ రివ్యూ బాగుంది. టోటల్ గా మూవీ సూపర్ అని ట్వీట్ చేశారు.

మొత్తానికి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది అని టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. మూవీ ఎలా ఉంది? కలెక్షన్స్ ఏ రేంజులో వస్తాయి? ఎన్టీఆర్ బాలీవుడ్ లో హిట్ కొట్టాడా? ఇవన్నీ తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చెయ్యాల్సిందే..

 

Related News

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

Coolie Review: కూలీ మూవీకి ఆ హీరో ఫస్ట్ రివ్యూ.. అదేంటీ అలా అనేశాడు, వెళ్లొచ్చా?

War 2 First Review : వార్ 2 ఫస్ట్ రివ్యూ.. హృతిక్ కంటే ఎన్టీఆరే!

Bakasura Restaurant Movie Review : బకాసుర రెస్టారెంట్ రివ్యూ : హాఫ్ బేక్డ్ మూవీ

Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?

Big Stories

×