E-Paper
Advertisement

Pathum Nissanka Six: నిస్సంక భ‌యంక‌ర‌మైన సిక్స్‌…తుక్కు తుక్కైన‌ కారు..త‌ల‌ప‌ట్టుకున్న గంభీర్‌

Pathum Nissanka Six: నిస్సంక భ‌యంక‌ర‌మైన సిక్స్‌…తుక్కు తుక్కైన‌ కారు..త‌ల‌ప‌ట్టుకున్న గంభీర్‌
Advertisement

Pathum Nissanka Six: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా… టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య నిన్న ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ మ్యాచ్లో చివరికి టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్ దాకా వెళ్ళిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానించి విజయాన్ని దక్కించుకుంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచినప్పటికీ శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సంక అందరి మనసులు దోచుకున్నాడు. అద్భుతమైన సెంచరీతో తుక్కు రేగ్గొట్టాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన పాతుమ్ నిస్సంక… కారు కూడా ధ్వంసం చేశాడు. అద్భుతంగా నిన్న బ్యాటింగ్ చేసి… ఓ భారీ సిక్సర్ కొట్టాడు.

Also Read: India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Advertisement

అయితే ఈ తరుణంలో పాతుమ్ నిస్సంక బాదిన‌ బంతి నేరుగా వెళ్లి.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కోసం గ్రౌండ్ లో పెట్టిన కారును తగిలింది. దీంతో ఆ కారు కాస్త డ్యామేజ్ అయింది. ఇక పాతుమ్ నిస్సంక కొట్టిన ఈ సిక్సర్ చూడడంతో గౌతమ్ గంభీర్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇదేం బ్యాటింగ్ రా అన్నట్లు వాపోయాడు. తల కూడా పట్టుకున్నాడు గంభీర్. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన సిక్స‌ర్ వీడియో ఫోటోలు, వీడియో లు వైర‌ల్ గా మారాయి.

నిస్సంక భ‌యంక‌ర‌మైన సిక్స్‌…తుక్కు తుక్కైన‌ కారు

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా… నిన్న టీమిండియా వ‌ర్సెస్ శ్రీలంక మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఇందులో శ్రీలంక డేంజ‌ర్ ఆట‌గాడు..పాతుమ్ నిస్సంక రెచ్చిపోయాడు. ఇందులో 58 బంతుల్లో 107 ప‌రుగులు చేశాడు పాతుమ్ నిస్సంక. చివ‌రి వ‌ర‌కు పోరాడిన పాతుమ్ నిస్సంక… చివ‌ర‌కు హ‌ర్శిత్ రాణా ఔట్ అయ్యాడు. అత‌ను ఔట్ కాక‌పోయి ఉంటే… టీమిండియా ఓట‌మి పాలైయ్యేది. అయితే.. ఈ మ్యాచ్ లో హ‌ర్శిత్ రాణా బౌలింగ్ లో పాతుమ్ నిస్సంక అద్భుత‌మైన సిక్స‌ర్ కొట్టాడు. అయితే… ఆ బంతి గ్రౌండ్ లో ప్ర‌మోష‌న్స్ కోసం తెచ్చిన కారుకు త‌గిలింది. దీంతో ఆ కారు కాస్త డ్యామేజ్ అయింది. ఇక ఈ సిక్స‌ర్ చూసిన గంభీర్ షాక్ అయ్యాడు. త‌న శిష్యుడు హ‌ర్శిత్ రాణా బౌలింగ్ లో పాతుమ్ నిస్సంక సిక్స్ కొట్ట‌డం చూసి త‌ల ప‌ట్టుకున్నాడు గంభీర్‌. టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య నిన్న ఫైట్ జరిగిన మ్యాచ్ లో చాలా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ డ్రా అయితే.. సూప‌ర్ ఓవ‌ర్ దాకా వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే.. సూప‌ర్ ఓవ‌ర్ లో శ్రీలంక 2 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో ఒకే ఒక బంతికి బౌండ‌రీ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు సూర్య కుమార్ యాద‌వ్‌.  ఇక రేపు ఫైన‌ల్స్ లో టీమిండియా వ‌ర్సెస్ పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Advertisement

 

 

Related News

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

Big Stories

Advertisement
×