Asia Cup 2025 : ఆసియా కప్ 2025 సూపర్ 4 దశ మ్యాచ్ ఇవాళ చివరి మ్యాచ్ జరుగుతోంది. సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ ఆల్ రౌండర్ హారిస్ రవూఫ్ కి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పడింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన సందర్భంలో విజయం సాధించగానే ప్రెస్ మీట్ లో ఈ మ్యాచ్ విజయం ఇండియన్ ఆర్మీకి అంకితం అని ప్రకటించాడు. వాస్తవానికి క్రికెట్ రూల్స్ ప్రకారం.. అలా రాజకీయాలు మాట్లాడకూడదు.
Also Read : IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో
అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ అలా రాజకీయాలు మాట్లాడాడని.. టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని.. అప్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు హోటల్ లోనే ఉండి ఆలస్యంగా వచ్చారు. కీలక మ్యాచ్ లో విజయం సాధించి.. సూపర్ 4 కి అర్హత సాధించింది. సూపర్ 4లో టీమిండియాతో ఓటమి పాలైనప్పటికీ.. కీలక మ్యాచ్ ల్లో విజయం సాధించి.. సెప్టెంబర్ 28న ఫైనల్ లో మరోసారి టీమిండియాతో తలపడనుంది పాకిస్తాన్ జట్టు. ఈనెల 21న సూపర్ 4 మ్యాచ్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ టీమిండియా అభిమానులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. అంతే కాదు.. ఆపరేషన్ సింధూర్ ని కూడా అవమానించాడు. దీంతో బీసీసీఐ పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్ పై ఫిర్యాదు చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. హారిస్ రవూఫ్ పై మూడు మ్యాచ్ ల పాటు నిషేదం విధించారు. అలాగే పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ కి ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది.
ముఖ్యంగా క్రికెట్ గ్రౌండ్ వారి రిఫరెన్స్ లు తీసుకొచ్చినందుకు.. అలాగే అభిమానులతో అనుచితంగా ప్రవర్తించినందుకు మ్యాచ్ నుంచి 30 శాతం మ్యాచ్ ఫీజుతో పాటు హారిస్ రౌఫ్ పై ఐసీసీ 3 మ్యాచ్ ల నిషేదం విధించినట్టు సమాచారం. దీంతో ఈనెల 28న జరిగే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కి హారిస్ రవూఫ్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.సూపర్ 4 మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ కాస్త ఓవర్ యాక్ట్ చేశాడు పాకిస్తాన్ బౌలర్ హరీస్ రఫ్. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ… రఫెల్ జెట్ ను కూల్చేసామని అర్థం వచ్చేలా సిగ్నల్స్ ఇచ్చాడు. భారత రఫెల్ జెట్ ను కూల్చి వేసామని హరీస్ రఫ్ అన్న తరుణంలోనే.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు టీమిండియా అభిమానులు. పాకిస్తాన్ బౌలర్ హరీస్ రఫ్ ను ఉద్దేశించి కోహ్లీ కోహ్లీ అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 14న మీడియాతో మాట్లాడితే.. దాదాపు వారం రోజుల తరువాత పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా నిరాకరించాడు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంఘీభావం తెలిపాడు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Pakistan’s Sahibzada Farhan has reportedly been let off with a warning for his celebration, while Haris Rauf and Suryakumar Yadav have been fined 30% of their match fees.#SuryakumarYadav #India #T20Is #AsiaCup #Sportskeeda pic.twitter.com/LQHz4uLfxg
— Sportskeeda (@Sportskeeda) September 26, 2025