RCB Fans : ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ జట్టు పై 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో కొద్ది సేపు బెంగళూరు.. మరికొద్ది సేపు పంజాబ్ విజయం సాధిస్తుందని అభిమానులకు ఉత్కంఠగా నెలకొంది. చివరికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఓ మహిళా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించకపోతే తన భర్తకి విడాకులు ఇస్తానని చెప్పింది. మరో మహిళా ఆర్సీబీ విజయం సాధిస్తే.. తన లవర్ కి ప్రపోజ్ చేస్తానని చెప్పడం. కొంత మంది బెట్టింగ్ లు వేయడం.. మరికొంత మంది పార్టీలు చేసుకోవడం ఇలా రకరకాలుగా చేశారు. ఇప్పటివరకు జరిగిన 17 సీజన్ల విజయాలు ఒక ఎత్తు.. 18వ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ మరో ఎత్తు అనే చెప్పాలి.
Also Read : Karnataka CM: RCBకి బిగ్ షాక్.. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయండి.. సీఎం ఆదేశాలు
ఎందుకంటే..? ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో ఏ జట్టు విజయం సాధించినా ఇంత హంగామా లేదు. మరోవైపు 18 సంవత్సరాల పాటు నీరిక్షించిన విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. దీంతో ఒక్క కర్ణాటకలోనే 154.94 కోట్ల లిక్కర్ సేల్ కావడం విశేషం. ఇలా దేశ వ్యాప్తంగా సంబురాలకు ఆర్సీబీ అభిమానులు చాలానే ఖర్చు చేశారు. ఇక ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన వేళ.. ఇద్దరూ లవర్స్ కిస్ చేసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ కి ముందు ఆర్సీబీ ఈ సారి విజయం సాధిస్తే.. తప్పకుండా ప్రపోజ్ చేస్తానని చెప్పింది యువతి. ఇక ఆర్సీబీ విజయం సాధించడంతో తన లవర్ కి లవ్ ఓకే చెప్పి కిస్ ఇచ్చింది. ఇక వారిని చూసిన అభిమానులు ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ కేకలు వేస్తూ సంబురాలు జరుపుకున్నారు.
మరోవైపు ఆర్సీబీ విజయం సాధించడంతో నిన్న రాత్రి బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆర్సీబీ టీమ్ ఆటగాళ్లు అందరూ హాజరు కావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఆ మృతికి ఆర్సీబీ యాజమాన్యమే కారణం అని పలువురు పేర్కొన్నారు. అయితే ఆర్సీబీ యాజమాన్యం స్పందించి.. ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. మరోవైపు ఈ ఘటన పై కర్ణాటక హైకోర్టు ప్రభుత్వం పై సీరియస్ అయింది. ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని స్పందించింది. భద్రత కట్టుదిట్టంగా లేనప్పుడు సంబరాలకు అనుమతి ఏవిధంగా ఇచ్చారని ప్రశ్నించింది. దీంతో మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇంత జరుగుతున్నా కానీ అభిమానులు ఇంకా పిచ్చోళ్లలాగా వ్యవహరిస్తున్నారని కొందరూ పేర్కొంటున్నారు. మ్యాచ్ జరిగి మూడు కావస్తున్నా తమ జట్టు విజయం సాధించింది.. తమ జట్టు వరల్డ్ ఛాంపియన్ అన్నట్టుగా ఆర్సీబీ అభిమానులు వ్యవహరిస్తున్నారని మరికొందరూ కామెంట్స్ చేయడం విశేషం. ఏది ఏమైనప్పటికీ 18 సంవత్సరాల తరువాత ఆర్సీబీ జట్టు టైటిల్ సాధించడంతో అభిమానులు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.
?igsh=bWkxYnFqbTduaWls