Karnataka CM: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర 11 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మృతి చెందిన సంఘటనపై కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో…. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
బెంగళూరు ప్రతినిధులను అరెస్టు చేయండి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర 11 మంది మృతి చెందిన నేపథ్యంలో బాధ్యులందరినీ అరెస్టు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ దీనిపై కర్ణాటక డిజిపితో సమీక్ష నిర్వహించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ నేపథ్యంలో బెంగుళూరు తొక్కిసలాట సంఘటనపై.. చాలా సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అదే సమయంలో డిజిపికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాయల్ చాలెంజెస్ బెంగళూరు, DNA మేనేజ్మెంట్ అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా వెంటనే అరెస్టు చేయాలని స్పష్టంగా డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందస్తు సమాచారం లేకుండా ర్యాలీలు అలాగే.. పరేడ్ నిర్వహించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా పరేడ్ నిర్వహించేలా.. చేశారని కూడా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిజిపి కిలక ఆదేశాలు… ఇచ్చారు. బాధ్యులు ఎవ్వరిని కూడా వదలకూడదని.. అందరినీ అరెస్టు చేయాలని ఆదేశించారు.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటనపై రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టును A1 గా పేర్కొంది కర్ణాటక పోలీస్ శాఖ. అలాగే డిఎన్ఏ మేనేజ్మెంట్ ను ఏ 2 గా ఇక ఏ 3 గా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ను చేర్చింది పోలీస్ శాఖ. ఇక తాజాగా బాధ్యులందరినీ అరెస్టు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు ఇవ్వడంతో.. ఈ సంఘటన మరింత హాట్ టాపిక్ అయింది.
చనిపోయిన వారికి పరిహారం ప్రకటించిన RCB
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర మృతి చెందిన 11 మంది కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం పరిహారం ప్రకటించింది. ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.