BigTV English

U-19 World cup IND vs NEP : సెమీస్‌కు యువ భారత్.. నేపాల్‌పై ఘనవిజయం..

U-19 World cup IND vs NEP : సెమీస్‌కు యువ భారత్.. నేపాల్‌పై ఘనవిజయం..
U-19 Worldcup IND vs NEP

U-19 World cup IND vs NEP : అండర్‌- 19 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో యువభారత్‌ దూసుకుపోతుంది. శుక్రవారం బ్లూమ్‌ఫౌంటీన్‌ వేదికగా జరిగిన రెండో సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో నేపాల్‌పై 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో కెప్టెన్ ఉదయ్‌ సహరన్‌(100), సచిన్‌ దాస్‌ (116) సెంచరీలతో కదం తొక్కారు. నేపాల్ బౌలర్లలో గుల్సన్ ఝా మూడు, ఆకాశ్‌ చంద్ ఒక వికెట్‌ తీశారు.


అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో నేపాల్ నడ్డి విరిచాడు. కులకర్ణి 2, ఆరాధ్య సుక్లా, రాజ్‌ లింబాని, మురుగన్‌ అభిషేక్‌ తలో వికెట్‌ తీశారు. నేపాల్ బ్యాటర్లలో కెప్టెన్ దేవ్‌ ఖనల్‌ (33) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒక దశలో 120 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన నేపాల్‌ను ఆకాశ్ చంద్(19), దుర్గేశ్‌ గుప్తా (29) అజేయంగా నిలిచారు. ఇప్పటకే గ్రూప్ స్టేజ్‌లో మూడు, సూపర్ సిక్స్‌లో రెండు విజయాలతో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.


Tags

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×