BigTV English

Vinesh Phogat: వినేశ్ కి గోల్డ్ మెడల్.. వచ్చింది!

Vinesh Phogat: వినేశ్ కి గోల్డ్ మెడల్.. వచ్చింది!

Vinesh Phogat gets gold Medal Honour by Haryana khap on Birthday: ఆ.. ఆ.. హాశ్చర్యపోకండి.. అంటే వినేశ్ ఫోగట్ కి గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ కమిటీ ఇవ్వలేదు. వాళ్లు అదే మాటపై ఉండిపోయారు. అయినా వాళ్లెవరూ ఇవ్వడానికి, మా బిడ్డకి మేమిస్తామంటూ.. వినేశ్ కి.. బలాలీ గ్రామస్తులు ఇవ్వడం విశేషం. గ్రామస్తులు ముందు నుంచి చెబుతున్నట్టే.. ఒక మాట మీద నిలిచారు. ఈ నేపథ్యంలో  హర్యానా ఖాప్ పంచాయత్ బంగారు పతకంతో వినేశ్ ని గౌరవించింది.


వినేశ్ 30వ పుట్టినరోజు నాడు ఆమెకు ఈ మెడల్‌ను అందజేసింది. ఖాప్ పంచాయత్ తన సొంత నిధులతో దీన్ని తయారు చేయించింది. ఈ పతకంపై ఒలింపిక్స్ సింబల్, 2024 అనే అక్షరాలను ముద్రించింది.

దీనిపై వినేష్ ఫొగట్ స్పందించింది. తన సొంత ఊరిలో, సొంత మనుషుల మధ్య పుట్టినరోజు వేడుకలను చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. అంతకుమించి హర్యానా ఖాప్ పంచాయత్ తనకు బంగారు పతకాన్ని బహూకరించడం.. తన జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుందని పేర్కొంది.


అలాగే తన రిటైర్మెంట్ పై మాట్లాడుతూ.. నా పోరాటం ముగియలేదని తెలిపింది. భారత అమ్మాయిల కోసం ఇప్పుడే నా పోరాటం మొదలైందని తెలిపింది. ఈ మాటలు చూస్తుంటే, బహుశా తను రెజ్లింగ్ కోచింగ్ అకాడమీ గానీ పెడుతుందేమోనని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా వినేశ్ పెదనాన్న మహావీర్ ఫోగట్ మాట్లాడుతూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూస్తామని అన్నారు.

Also Read: వినేశ్ కి ఎవరూ డబ్బులివ్వలేదు: భర్త సోమ్ వీర్

వినేశ్ కి దేశంలో వచ్చిన పేరు, ప్రతిష్ట చూసి పెద్ద పెద్ద కంపెనీలు, తమ ప్రచారకర్తగా ఆమెను నియమించుకున్నాయి. అలా ఆమెకు ఆర్థికంగా సాయం లభించింది. ఇలా గ్రామస్తుల రూపంలో బంగారు పతకం దొరికింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిన సత్కరిస్తుందో, ఏ అవార్డుతో గౌరవిస్తుందో వేచి చూడాలి.

ఇకపోతే రెండు సందర్భాల్లో దేశ ప్రధాని మోదీ కూడా స్పందించారు. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ అని వినేశ్ ను కీర్తించారు. అలాగే పతకం పోయిందని నిరాశ చెందవద్దని తెలిపారు. నువ్వు మా బంగారు తల్లివి అని కూడా అన్నారు. అలాగే కేంద్ర క్రీడాశాఖామంత్రి కూడా వినేశ్ ను పొగిడారు. ఈ పరిస్థితుల్లో క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం అర్జున లేదా ఖేల్ రత్న లాంటి పురస్కారాలు అందుతాయని అంతా ఆశిస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×