BigTV English

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

RCB:  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. చిన్న స్వామి స్టేడియం ఉండగానే మరో కొత్త స్టేడియాన్ని నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు.. దాదాపు 1650 కోట్లు ఖర్చుపెట్టి… 80 వేల కెపాసిటీతో స్టేడియాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారట.


Also Read: Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

చిన్నస్వామి స్టేడియాన్ని మించి పోయేలా కొత్త స్టేడియం


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట నేపథ్యంలో మొత్తం 11 మందికి పైగా మరణించారు. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు… చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించబోరని చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ బోర్డు అసోసియేషన్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

80,000 మంది ప్రేక్షకులు కూర్చునేలా స్టేడియం

చిన్న స్వామి స్టేడియం చాలా చిన్నగా ఉన్న నేపథ్యంలో.. బెంగళూరు అవుట్ కట్స్ లో భారీ ఎత్తున స్టేడియాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారట. ఏకంగా 1650 కోట్లు ఖర్చుపెట్టి… 80 వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా స్టేడియాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఈ మేరకు అతి త్వరలోనే కర్ణాటక కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోనుందని.. అనంతరం నిర్మాణం చేపట్టబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో 18వ ఛాంపియన్ గా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే చాంపియన్ అయిన తర్వాత.. చిన్న స్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించారు. అయితే ఆ పరేడ్ పూర్తిగా విఫలమైంది. బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమానులు దాదాపు 3 లక్షల మంది చిన్న స్వామి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. ఆ సమయంలో 5000 మంది పోలీసులు కూడా స్టేడియం దగ్గర లేరు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది బెంగళూరు అభిమానులు మరణించారు.

Also Read: Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

విరాట్ కోహ్లీ కారణంగానే తొక్కిసలాట జరిగిందని ప్రచారం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament )  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB 2025 ) విజయం సాధించిన తర్వాత చిన్నస్వామి స్టేడియం వేదికగా పరేడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ తెల్లారితే లండన్ కు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యం లోనే.. వెంటనే చిన్నస్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో హడావిడిగా పర్మిషన్లు తీసుకోవడం.. అనంతరం 11 మంది మరణించడం జరిగిపోయింది.

?igsh=MnU5bXU2anEzMzZs

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×