Akash Deep: ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో ఇతడి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అతడే ఆకాష్ దీప్. ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన తొలి టెస్ట్ లోనే సత్తా చాటడమే ఇందుకు కారణం. ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టెస్ట్ లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన ఆకాష్ దీప్.. అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈ టెస్ట్ లో ఏకంగా 10 వికెట్లు తీసి టీం ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో నైట్ వాచ్ మెన్ గా బ్యాటింగ్ కి దిగి.. 66 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ కి సాయం చేశారు.
Also Read: Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?
ఇంగ్లాండ్ తో జరిగిన ఈ సిరీస్ లో తన ప్రదర్శనని క్యాన్సర్ తో బాధపడుతున్న తన సోదరికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు ఆకాశ్ దీప్. అయితే అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతగానో కష్టపడ్డాడు. భారత్ కి ఆడాలనే తన కలను సహకారం చేసుకోవడంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. బీహార్ లోని సస్రామ్ లో క్రీడా నేపథ్యం లేని పేద కుటుంబంలో జన్మించిన ఆకాశ్ దీప్.. ఎన్నో కష్టాలను అధిగమించి భారత జట్టుకు ఆడే స్థాయికి ఎదిగాడు. చిన్ననాటి నుండి భారత జట్టుకు ఆడాలని ఎన్నో కలలు కన్నప్పటికీ.. పేద కుటుంబం కావడంతో క్రికెట్ ఆడడాన్ని అతడి తండ్రి ప్రోత్సహించలేదు.
ఈ విషయం గురించి ఓ సందర్భంలో ఆకాశ్ దీప్ మాట్లాడుతూ.. “క్రికెట్ ఆడితే భవిష్యత్తు ఉండదని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నా తండ్రి సూచించేవాడు. అంతేకాకుండా బీహార్ లో క్రికెట్ ఆడడాన్ని ఓ నేరంగా చూస్తారు. ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలను నాతో కలవద్దని హెచ్చరించేవారు. అతడు క్రికెట్ ఆడతాడు, మీ చదువులు పాడవుతాయి అని వారికి చెప్పేవారు. నేను మాత్రం సీక్రెట్ గా క్రికెట్ ఆడేవాన్ని” అని తెలిపాడు. ఇక బీహార్ లో ఉంటే క్రికెట్ పై దృష్టి సారించలేనని భావించిన ఆకాష్.. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కి మకాం మార్చాడు. అక్కడికి వెళ్లిన తర్వాత బ్యాటర్ నుండి ఫాస్ట్ బౌలర్ గా మారి.. క్లబ్ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు.
అతడు పశ్చిమబెంగాల్ వెళ్లిన ఆరు నెలల వ్యవధిలోనే అతడి తండ్రి, సోదరుడు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో తల్లి బాగోగులు, కుటుంబ బాధ్యతలను చూసుకోవడానికి తిరిగి సొంత ఊరుకు చేరుకున్నాడు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ చేరుకున్నాడు. అనంతరం కలకత్తా కి వెళ్లి బెంగాల్ జట్టులో చేరాడు. అలా 2019లో రంజి ట్రోఫీలో అరంగేట్రం చేసి, 2019లో 35 వికెట్లు పడగొట్టి, బెంగాల్ రన్నరప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2021లో ఐపీఎల్ లో ఆర్సిబి జట్టు తరుపున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇక అక్కడి నుండి ఆకాష్ వెనుతిరిగి చూడలేదు.
Also Read: Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!
2024 లో స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెగ్యులర్ భారత జట్టులో భాగంగా ఉంటున్నాడు. ఇక తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం.. భారత్ చేరుకున్నాక ఆకాష్ దీప్ కొత్త కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆకాష్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. షోరూంలో కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ.. ” కల నెరవేరింది” అంటూ రాసుకొచ్చాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న అతడి సోదరీ అఖండ్ జ్యోతి సింగ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కారు వేడుకలలో పాల్గొన్నారు. దీంతో ఆకాష్ దీప్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
?utm_source=ig_web_copy_link