Rahul Dravid: భారత క్రికెట్ లో విజయవంతమైన కోచ్ లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్. 2021 టీ-20 ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి స్థానంలో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన ఈ కర్ణాటక లెజెండ్.. టీమిండియాని అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలిపాడు. రాహుల్ ద్రావిడ్ మార్గదర్శనంలో ద్వైపాక్షిక సిరీస్ లలో కూడా వరుస విజయాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది భారత జట్టు. అయితే ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న సమయంలో క్రికెట్ అభిమానులంతా ఎంతగానో సంతోషించారు.
Also Read: Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!
ఇకనుండి టీమ్ ఇండియా దశ, దిశ తిరిగి పోతుందని, జట్టు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుందని భావించారు. కానీ రియాల్టీకి వచ్చేసరికి మాత్రం కొంతకాలానికే పరిస్థితి వేరుగా మారింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్ల విషయంలో జోక్యం చేసుకొని.. యువ క్రికెటర్లతో మాత్రం ఓ ఆట ఆడుకున్నాడనే విమర్శలు ద్రావిడ్ పై ఉన్నాయి. ఇక 2022 టీ-20 ప్రపంచ కప్ సెమీఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2021 – 2023, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ టోర్నీలో భారత జట్టు టైటిల్ గెలవలేకపోయింది. దీంతో రాహుల్ ద్రావిడ్ ని వెంటనే కోచ్ గా తొలగించాలని డిమాండ్లు కూడా వచ్చాయి.
కానీ బీసీసీఐ మాత్రం అతడి పై నమ్మకం ఉంచింది. ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రవిడ్ పై మరో ఆరోపణ కూడా ఉంది. యువ ఆటగాళ్లు మనీష్ పాండే, పృద్వి షా, రిషబ్ పంత్ కెరీర్ లను రాహుల్ ద్రావిడ్ నాశనం చేశాడని.. ఇప్పుడు వైభవ్ సూర్యవంశి కూడా రాహుల్ ద్రావిడ్ చేతిలో తన కెరీర్ ని నాశనం చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. పృద్వి షా ని భారత క్రికెట్ లో నెక్స్ట్ సచిన్ అన్నారు. క్రికెట్ లో అతడే తదుపరి స్టార్ అని అంచనా వేశారు. అతడే భారత జట్టును ముందుకు తీసుకువెళ్తాడని ఊదరగొట్టారు. కానీ అవన్నీ తప్పని తేలింది.
ఇంటర్నేషనల్ మ్యాచ్ లు పక్కన పెడితే.. ఐపీఎల్ లో కూడా ఆడే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. 25 ఏళ్లకే అతడి కెరీర్ డేంజర్ లో పడింది. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో పృద్వి షా అండర్ 19 వరల్డ్ కప్ సాధించాడు. అదే సమయంలో అతడిని నెక్స్ట్ సచిన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అదే పృద్వి షా ఎనిమిదేళ్లు తిరిగేసరికి భారత జట్టులోనే కాకుండా, ఐపీఎల్ లో కూడా అన్ సోల్డ్ గా మిగిలాడు. అలాగే రాహుల్ ద్రావిడ్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ గా ఉన్న సమయంలో.. ఐపీఎల్ లో మొదటి సెంచరీ చేశాడు మనీష్ పాండే.
Also Read: Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా
ఐపీఎల్ లో ఓ 19 ఏళ్ల కుర్రాడు సెంచరీ చేయడం ఇదే తొలిసారి. కానీ ఆ తర్వాత మనీష్ పాండే ఎక్కడా కనిపించలేదు. వీరితోపాటు దేశవాళీలో సూపర్ ఫాస్ట్ సెంచరీ చేసిన రిషబ్ పంత్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాడు. వీరితోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల మీడియాలు కూడా పొగడ్తలతో ముంచేసిన భారత యువ ఆటగాడు యశస్వి జైష్వాల్.. ప్రస్తుతం ఆటిట్యూడ్ ఇష్యూస్ తో, సీనియర్లతో గొడవలతో వార్తల్లో నిలుస్తున్నాడు.
?utm_source=ig_web_copy_link