BigTV English

Malayalam star Prithviraj: వెళ్లిపోండి..అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి.. హేమ కమిటీపై నటుడు పృథ్వీరాజ్

Malayalam star Prithviraj: వెళ్లిపోండి..అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి.. హేమ కమిటీపై నటుడు పృథ్వీరాజ్

Malayalam star Prithviraj on Hema panel report: మలయాళ సినీ పరిశ్రమలో మహిళా నటీమణుల వేధింపులపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. కొంతమంది అగ్రనటులపై వచ్చిన ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి.


క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళా నటీమణులపై వేధింపులు చేసినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే పలువురు నటీమణులకు జరిగిన వేధింపులను చెప్పుకొచ్చారు. తాజాగా, హేమా కమిటీ రిపోర్ట్‌పై మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు పదవులు నుంచి తప్పుకోవాలన్నారు.

కొచ్చిలో ఫుట్‌బాల్ క్లబ్ ‘ఫోర్కా కిచ్చి ప్రారంభోత్సవంలో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడారు. మలయాళ సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై ఘాటుగా స్పందించాడు. అధికారంలో ఉంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వెంటనే పరిశ్రమను వదిలిపెట్టి పోవాలని, పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.


లైంగికంగా వేధింపులకు పాల్పడిన వారిని హేమా కమిటీ నివేదిక ఆధారంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిందితులు దోషులుగా రుజువైతే తీవ్రంగా పరిగణలోకి శాశ్వతంగా సినీ పరిశ్రమ నుంచి వెళ్లేలా పరిష్కారం చేయాలన్నారు.

హేమా కమిటీ నివేదికలో వెల్లడించిన అంశాలు ఆశ్చర్యం కలిగించలేదని నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే పరిశ్రమలో మహిళలకు గౌరవం, సురక్షిత పని వాతావరణం కల్పించడం పరిశ్రమలో ఉన్న ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. మహిళలను గౌరవించడంతో నేను ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానని, కానీ నేను ఒక్కడినే ఉంటే సరిపోతుందా అని నటుడు అన్నారు.

సినీ పరిశ్రమలో మహిళలకు ప్రత్యేక వాతావరణం కల్పించడం నా ఒక్కడి బాధ్యత మాత్రమే కాదని, పరిశ్రమలో ఉన్న పెద్దల నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు అందరూ ఈ పద్ధతిని అనుసరించాలన్నారు. అంతే కాదు జూనియర్ ఆర్టిస్టులు ఎంపికను వీలైనంత త్వరగా క్రమబద్దీకరించాలని వెల్లడించారు.

Also Read: ఎమర్జెన్సీ సినిమా విడుదలకు అన్నీ చిక్కులే..

అయితే, హేమా కమిటీ రిపోర్టుపై అగ్రనటుడు మోహన్ లాల్ ఎందుకు మాట్లాడడం లేదని నటుడు షమ్మీ తిలకన్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలపై అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ ప్రెసిడెంట్ ఎందుకు స్పందించలేదంటూ విమర్శలు చేశారు. ఈ విషయంపై మోహన్ లాల్ ఇంకా మాట్లాడకపోవడంపై పలు రకాలు వార్తలు పరిశ్రమలో వైరల్ అవుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×