Virender Sehwag: శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్ ను (Tri Nation A Series in Sri Lanka 2026 ) టీమిండియా లిస్టు ఏ జట్టు సొంతం చేసుకుంది. దంబుల్లా వేదికగా (Rangiri Dambulla International Stadium, Dambulla) శ్రీలంక వర్సెస్ టీమిండియా ఏ జట్ల (Sri Lanka A vs India A, Final) మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్స్ లో శ్రీలంకపై 66 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది టీం ఇండియా. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 377 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పోరాడిన లంక 47.1 ఓవర్సులో 311 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో ట్రై సిరీస్ సొంతం చేస్తుంది టీం ఇండియా.
ట్రై సిరీస్ ఫైనల్స్ (Tri Nation A Series in Sri Lanka 2026 ) నేపథ్యంలో శ్రీలంకపై అధికారం తీర్చుకున్న వైభవ్ సూర్యవంశీను ( Vaibhav Suryavanshi) ఉద్దేశించి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్ లో 29 బంతుల్లో 94 పరుగులు చేసిన వైభవ్ ను మెచ్చుకుంటూ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయసులో తనకు బ్యాట్ కూడా సరిగ్గా పట్టరాని పరిస్థితి ఉండేదని.. కానీ ఇదే వయసులో రికార్డుల మీద రికార్డులు వైభవ్ బద్దలు కొడుతున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు అందుకొని రికార్డులను, అవలీలగా బద్దలు కొడుతూ చరిత్ర సృష్టిస్తున్నాడని 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
వైభవ్ సూర్యవంశీ.. రోజు రోజుకు తనను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. దిగ్గజ క్రికెటర్ల రికార్డులను 15 ఏళ్ల వయసులోనే బద్దలు కొడుతున్నాడని మెచ్చుకున్నారు. 11 బంతుల్లో అర్థ సెంచరీ చేయడం, చాలా గ్రేట్ అన్నారు. భవిష్యత్తులో మరింత భయంకరమైన ఆటగాడిగా వైభవ్ రాటు తేలడం గ్యారంటీ అంటూ హెచ్చరించారు. వైభవ్ పట్ల ప్రత్యర్థి ప్లేయర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. అటు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akthar) కూడా 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పై ( Vaibhav Suryavanshi )ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. 50 ఓవర్ల మ్యాచ్ ను 20 ఓవర్స్ మ్యాచ్ గా మార్చుతున్నాడని ప్రశంసించారు. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాలను కూడా మైమరిపించేలా బ్యాటింగ్ చేస్తున్నాడని వెల్లడించారు.