Virender Sehwag On Rahane Retirement: టీమిండియా దిగ్గజ క్రికెటర్ అజింక్య రహానే రిటైర్మెంట్ (Ajinkya Rahane Retirement) ప్రకటించారు. అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు వీడియో ద్వారా వెల్లడించారు రహానే. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. జీవితంలో ప్రతి పనికి ఆరంభం… అదే సమయంలో ముగింపు ఉంటుందని.. అందుకే ఇవాళ ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందంటూ రహానే వ్యాఖ్యానించారు. దీంతో అజింక్య రహానే ఇరవై ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. అయితే అజింక్య రహనే ఎమోషనల్ రిటైర్మెంట్ ప్రకటించడంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. గౌతమ్ గంభీర్ (Virender Sehwag ) లాంటి వెధవల వల్ల… రహానే రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని బాంబు పేల్చారు. అవకాశాల కోసం ఎదురుచూసి చూసి, మరో దిక్కు లేక రిటైర్మెంట్ ఇచ్చాడని పేర్కొన్నారు. అజింక్య రహానే (Ajinkya Rahane ) టాలెంట్ ను గుర్తించకపోవడం కారణంగానే అతను ఈ నిర్ణయానికి వచ్చాడని కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !
అజింక్య రహానే రిటైర్మెంట్ పై వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అజింక్య రహానే సామర్థ్యానికి తగ్గ గుర్తింపు టీమ్ ఇండియాలో రాలేదని ఎమోషనల్ అయ్యారు. ఎవరు అంచనా వేయలేని విధంగా అతడు ఆడతాడని…కానీ అతని టాలెంట్ గుర్తించడంలో బీసీసీఐ విఫలమైందని సీరియస్ అయ్యారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రహానేకు టీమిండియా నుంచి పిలుపు రాలేదని కీలక విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలోనే అజింక్య రహానే రిటైర్మెంట్ దాకా వెళ్లాల్సి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే గౌతమ్ గంభీర్… గొప్పగా ఆలోచించి అజింక్య రహానే లాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి ఉంటే, టెస్ట్ క్రికెట్ లో టీమ్ ఇండియా మరిన్ని విజయాలను నమోదు చేసుకునేదని వివరించారు. కానీ అతని సెల్ఫిష్ నెస్ కారణంగా అజింక్య రహానే లాంటి గొప్ప ప్లేయర్లు ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే రిటైర్మెంట్లు ప్రకటించాల్సి వస్తోందని ఎమోషనల్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్.
ఆస్ట్రేలియా గడ్డపై 2021 సంవత్సరంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియాకు అందించిన ఘనత అజింక్య రహానేకు దక్కుతుందని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే చారిత్రాత్మక విజయమని గుర్తు చేశారు. ఇలాంటి విజయాలను మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో కూడా టీమిండియా అందుకోలేదని పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా.. 20 ఏళ్ల పాటు టీం ఇండియాకు సేవలు చేసిన అజింక్య రహానేకు.. సరైన రిటైర్మెంట్ దక్కలేదని ఫైర్ అయ్యారు.