Gautam Gambhir: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తికాగానే.. ఇంగ్లాండ్ వెళ్ళింది టీం ఇండియా. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు లేకుండానే గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్ వెళ్లిపోయింది టీమిండియా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగియకముందే టెస్టులకు కూడా రోహిత్ శర్మ అటు విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ తరుణంలోనే టీమిండియా కొత్త కెప్టెన్ గా గిల్ కు బాధ్యతలు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అటు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్సి ఇచ్చింది బీసీసీఐ.
Also Read: RCB Stampede: 11 మంది చావులకు కారణం..దొంగచాటుగా పారిపోతున్న RCB ప్రెసిడెంట్ ?
టీమిండియాలో ముసలం.. గంభీర్ పై తిరుగుబాటు ?
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జూన్ 20వ తేదీ అంటే మరో నాలుగు రోజుల్లోనే ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టులో ముసలం నెలకొందని… సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీంతో ఇంగ్లాండ్ నుంచి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్యలోనే తిరిగి వచ్చాడని కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. తన తల్లి ఆసుపత్రి పాలయ్యారని.. అందుకే గౌతమ్ గంభీర్ ఇంగ్లాండు నుంచి తిరిగి ఇండియాకు వచ్చాడని కొంతమంది చెబుతున్నప్పటికీ… అసలు వాస్తవం అది కాదని తెలుస్తోంది.
గిల్ వర్సెస్ గౌతమ్ గంభీర్ ?
టీమిండియా కొత్త కెప్టెన్ గిల్ వర్సెస్ గౌతమ్ గంభీర్ మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయట. గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాలను గిల్ తీసుకునేందుకు… వెనకాడుతున్నారని తెలుస్తోంది. అలాగే తనకు నచ్చిన ప్లేయర్లను మాత్రమే ప్లేయింగ్ ఎలెవెన్… లో ఉంటారని కరాకండిగా గౌతమ్ గంభీర్… స్పష్టం చేశారట. ఈ విషయం గిల్ కు నచ్చలేదని తెలుస్తోంది. అయితే కొత్తగా కెప్టెన్ అయిన గిల్… ఇలా మొండిగా వ్యవహరించడం గౌతమ్ గంభీర్ కు అస్సలు నచ్చడం లేదట. దీంతో తన తల్లి అనారోగ్యం పేరు చెప్పి వెంటనే ఇండియాకు వచ్చాడట గౌతమ్ గంభీర్. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దీన్ని ప్రచారం చేస్తున్నారు.
టీమిండియా తాత్కాలిక కోచ్ గా లక్ష్మణ్
అర్థంతరంగా టీం ఇండియాను వదిలేసి.. ఇండియాకు వచ్చిన గౌతమ్ గంభీర్ స్థానంలో టీమిండియా కు కొత్త కోచ్ రాబోతున్నారట. ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య… జరగబోయే ఐదు టెస్టులకు గాను తెలుగోడు వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయట. దీంతో హుటాహుటిన ఇంగ్లాండు పయనమయ్యాడట వివిఎస్ లక్ష్మణ్.
Also Read: Kohli-ABD: ఆ లేడీ ప్రెగ్నెంట్..తన్నుకున్న కోహ్లీ, డివిలియర్స్.. ముఖం మీదే ఛీ కొట్టాడు ?
మళ్లీ ఇంగ్లాండ్ వెళ్తున్న గౌతమ్ గంభీర్ ?
ఇవాళ ఉదయం నుంచి గౌతమ్ గంభీర్ గురించి, మరో కొత్త వార్త బయటకు వచ్చింది. తన తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని.. ఇంగ్లాండ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని భారత క్రికెట్ నియంత్రణ మండలికి మళ్ళీ సమాచారం ఇచ్చారట గౌతమ్ గంభీర్. అయితే గౌతమ్ గంభీర్ చెప్పిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి… కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్లడం… నచ్చలేదని మళ్లీ ఇండియాకు వచ్చేయడం ఏంటని బీసీసీఐ అధికారులు ఫైర్ అవుతున్నారట. దీంతో కోహ్లీ అలాగే విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమిండియాలో క్రమశిక్షణ కరువైందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.