Kohli-ABD: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో రాణించి కెప్టెన్గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్ కావడమే కాకుండా గ్రౌండ్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండడం విరాట్ కోహ్లీ సొంతం. ఎంత పెద్ద క్రికెటర్ తప్పు చేసిన కానీ… వెంటనే తన నిరసన తెలిపేస్తాడు. లేదా గ్రౌండ్లో రెచ్చిపోతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే అలాంటి విరాట్ కోహ్లీకి… రాయల్ చాలెంజర్స్ మాజీ ప్లేయర్ ఎబి డివిలియర్స్ మధ్య గొడవ జరిగినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత
తనుకున్న కోహ్లీ, ఎబి డివిలియర్స్ ?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పగానే అందరికీ విరాట్ కోహ్లీ అలాగే 360 డిగ్రీ ప్లేయర్ ఎబి డివిలియర్స్ ఇద్దరు మాత్రమే గుర్తుకు వస్తారు. ఆ జట్టును ఓ రేంజ్ కు తీసుకు వెళ్లడంలో కోహ్లీ అలాగే ఎబి డివిలియర్స్ చాలా కష్టపడ్డారు. అయితే తాజాగా 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అలాగే ఎబి డివిలియర్స్ మధ్య గొడవలు ఉన్నాయని తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని 360 డిగ్రీ ప్లేయర్ ఎబి డివిలియర్స్ చెప్పేదాకా ఎవరికి తెలియలేదు. తనతో చాలా రోజుల పాటు విరాట్ కోహ్లీ మాట్లాడలేదని… ఇప్పుడు మాటలు కలిశాయని వెల్లడించారు ఎబి డివిలియర్స్.
అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడం వల్లే గొడవలు ?
విరాట్ కోహ్లీ అలాగే ఎబి డివిలియర్స్ మధ్య గొడవకు కారణం హీరోయిన్ అనుష్క శర్మ అని తెలుస్తోంది. అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత… ఆ విషయాన్ని మీడియాకు లేదా సన్నిహితులకు విరాట్ కోహ్లీ చెప్పలేదు. కానీ ఈ విషయాన్ని… ఎబి డివిలియర్స్ తో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ. 2024 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా… ఎబి డివిలియర్స్ కు విరాట్ కోహ్లీ చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత
అయితే ఆ విషయాన్ని.. తన మనసులో ఉంచుకోకుండా ఏ బి డివిలియర్స్… కక్కేశాడు. అది కూడా మీడియాకు చెప్పడంతో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి విరాట్ కోహ్లీ.. తన పైన అలిగాడని… మాట్లాడలేదని ఏ బి డివిలియర్స్ తాజాగా వెల్లడించారు. అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ మాటలు కలిశాయని… ఎబి డివిలియర్స్ వివరించారు. అయితే.. రాయల్ చాలెంజ్ బెంగళూరు ఫైనల్ కు రాగానే… అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియానికి వెళ్లి… ఆ జట్టుకు సపోర్ట్ చేశాడు ABD. బెంగళూరు టైటిల్ గెలిచిన తర్వాత కోహ్లీ అలాగే ఏ బి డివిలియర్స్ ఇద్దరు కూడా ఎంజాయ్ చేశారు.