RCB Stampede: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడం.. ఆ జట్టు యాజమాన్యానికి శాపంగా మారింది. ఇప్పుడు కోర్టుల చుట్టూ అలాగే జైల్లో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.. నెలకొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా బెంగళూరు జట్టు నిలవడంతో.. దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. 18 సంవత్సరాల తర్వాత… బెంగళూరు టైటిల్ కొట్టడంతో.. విరాట్ కోహ్లీ అభిమానులు అయితే రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత
చిన్న స్వామి దగ్గర 11 మంది మృతి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా బెంగళూరు విజయం సాధించిన నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన.. ప్లేయర్ లందరూ పాల్గొన్నారు. అయితే ఇక్కడికి 30 నుంచి 50 వేల మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వస్తారు అనుకుంటే పరిస్థితి రివర్స్ అయింది. ఏకంగా మూడు లక్షల మంది అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో కేవలం 5000 మంది పోలీసులు మాత్రమే స్టేడియం దగ్గర ఉండడం జరిగింది. ఇంకేముంది స్టేడియంలో.. క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఇక్కడే తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. 11 మంది మరణించడమే కాకుండా 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కొంతమంది ఐసీయూలో కూడా చికిత్స పొందుతున్నారు.
దొంగ చాటుగా పారిపోయిన RCB ప్రెసిడెంట్ ?
చిన్నస్వామి స్టేడియం దగ్గర 11 మంది మృతి చెందిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బెంగళూరు జట్టుకు సంబంధించిన మార్కెటింగ్ మేనేజర్ ను అరెస్టు చేశారు. మరి కొంతమందిని కూడా అరెస్టు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే తాజాగా కోర్టు విచారణ పూర్తయిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ప్రెసిడెంట్ రాజేష్ మీనన్… పారిపోతూ కనిపించాడు. మీడియా వాళ్ళు ప్రశ్నిస్తారని ముఖం చాటేసి మరీ పారిపోయి కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. బెంగళూరు జట్టు యాజమాన్యాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. జనాలు చనిపోతే ఇలా పారిపోతారా? అని ఫైర్ అవుతున్నారు చెన్నై అభిమానులు.
బెంగళూరు పై (RCB) మూడు సంవత్సరాల బ్యాన్?
చిన్నస్వామి స్టేడియం దగ్గర 11 మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మరణించిన నేపథ్యంలో… ఆ జట్టుపై బ్యాన్ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బ్యాన్ విధించాలని అనుకుంటే సంవత్సరం లేదా మూడు సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read: Anushka Shetty: టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి.. తనకంటే తక్కువ వయసు ప్లేయర్ తోనే ?
🚨 BREAKING 🚨
RCB President Rajesh Menon running after the hearing of Stampede case. pic.twitter.com/bZqLgy0tSJ
— ` (@WorshipDhoni) June 15, 2025