Remedies for white hair: ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే యువతలో తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం సరైన పోషక ఆహారం లేకపోవడంతో జుట్టు రంగు అనేది ఎక్కువగా మారుతుంది. ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
ఒక్కరోజులో తెల్ల జుట్టు నల్లగా మారే చిట్కా..
ఉసిరికాయ, కరక్కాయ, తాటి చెట్టు కొమ్మకు వచ్చే తాటి పూవరం ఈ మూడింటి రసాలు కలిపి రాత్రి సమయంలో నానబెట్టాలి. దీంతో ఉదయం వరకు అది నల్లగా మారుతుంది. ఇలా అయిన తర్వాత దీనిని తీసుకుని జుట్టుకు పట్టించి గంట తర్వాత కడిగితే మీ జుట్టు నల్లగా మారుతుంది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్‌గా మీ జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
నువ్వుల నూనె:
నువ్వుల నూనెను జుట్టుకు పెట్టుకోవడం వల్ల దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదళ్లను దెబ్బతినకుండా రక్షిస్తాయి, మెలానిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
కరివేపాకు-కొబ్బరినూనె:
జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, నల్లగా మార్చడంలో కరివేపాకు ఎంతో చక్కగా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో కరివేపాకులను డబుల్ బాయిలింగ్ పద్దతిలో మరిగించి చల్లరనివ్వాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి మర్దనా చేసి కాసేపు అలానే వదిలేయాలి.. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా, పొడవుగా మారుతుంది.
పచ్చి పసుపు:
అంతేకాకుండా పచ్చి పసుపును ఉపయోగించి కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చని పలు నిపుణులు చెబుతున్నారు. పసుపులో రాగి, ఇనుము, ఇతర ఔషధ గుణాలు ఉండటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.
Also Read: మీలో ఈ లక్షణాలుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి, స్కిన్ క్యాన్సర్ కావొచ్చు !
ఆహారం నియమాలు:
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం, విటమిన్ బి12, బి5, విటమిన్ డీ తీసుకోవడం ద్వారా తెల్ల జుట్టును సహజంగా తగ్గించవచ్చు. బెర్రీలు, ద్రాక్ష వంటి ఆహారాలు జుట్టు పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా జుట్టు నల్లబడుతుంది.
ఒత్తిడిని తగ్గించడం:
అయితే ఒత్తడి వల్ల కూడా జుట్టు తెలబడుతుందని చెబుతున్నారు. కావున ఒత్తడి స్థాయిలను తగ్గించడం వల్ల తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చు. అంతేకాకుండా ఉల్లిపాయ రసం కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుందని పలు అధ్యయానాల్లో తేలింది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించి 40 నిమిషాల్ల తర్వాత కడిగితే మంచి ఫలితాలు లభిస్తాయి.
మెహిందీ – కాఫీ పేస్ట్:
మెహిందీ, కాఫీ పేస్ట్ కలిపి జుట్టుకు అప్లై చేస్తే.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు బాగా పట్టించి.. ఓ గంట సేపు అలానే ఉంచండి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తల స్నానం చేయండి. పైనా చెప్పిన చిట్కాలు ఉపయోగించడం వల్ల మీ జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చని వైద్యలు తెలిపారు.