KTR – Kavitha : పుట్టెడు కష్టాల్లో ఉన్నారు కేటీఆర్. ఫార్ములా-ఈ కారు రేసులో ఏసీబీ విచారణ ఫేస్ చేస్తున్నారు. నేడో రేపో ఎల్లుండో ఆయన అరెస్ట్ పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సైతం తన అరెస్టుపై లీకులు ఇస్తున్నారు. ఏసీబీ ఎంక్వైరీ మందీమార్బలంతో తరలివచ్చారు. బావ హరీశ్‌రావుతో పాటు.. బాల్క సుమన్, పాడి కౌశిక్‌రెడ్డి, బాలరాజు యాదవ్ లాంటి చోటామోటా లీడర్లను వెంటేసుకొచ్చారు. సోమవారం.. హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత జగిత్యాల నవదుర్గ ఆలయంలో పూజలు చేయడం ఆసక్తికరంగా మారింది. అన్న కోసమే కవిత పూజలా? కేటీఆర్‌ను కాపాడమనా? అరెస్ట్ చేయొద్దనా? చేస్తే వెంటనే బెయిల్ రావాలనా? కవిత పూజలు ఎందుకోసం..?
కవిత నో రియాక్షన్!
కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి కేసీఆర్ హాజరైనప్పుడు తండ్రితో పాటు కవిత తోడుంది. మొదట ఫాంహౌజ్‌కు వెళ్లింది అక్కడ కూతురును కేసీఆర్ పట్టించుకోలేదు. అయినా, డాడినే కదా అని హైదరాబాద్ BRK భవన్ వరకు మరో కారులో వెంట వచ్చారు. కానీ, తండ్రి పక్కనే నిలిచే సాహసం మాత్రం చేయలేక పోయారు. ఎలా కారులో వచ్చారో… అలానే తిరిగి వెళ్లిపోయారు కవిత. ఆనాడు ఆ ఎపిసోడ్‌పై అనేక పొలిటికల్ గాసిప్స్ వినిపించాయి. అయితే, ఈనాడు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైతే మాత్రం కవిత నుంచి నో రియాక్షన్! దెయ్యానికి దూరంగా ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పడుతున్నాయి.
గుళ్లో కవిత పూజ..
ఏసీబీ ఎంక్వైరీకి వస్తూ కేటీఆర్ తన అనుచరులతో హడావుడి చేశారు. ఆ గుంపులో కవిత మాత్రం కనిపించలేదు. తండ్రికి తోడుగా వచ్చినట్టు.. రాఖీ కట్టిన అన్నకు అండగా నిలవలేదు. ఆయనే వద్దన్నారా? ఈమెనే వద్దనుకున్నారా?. అదే సమయంలో కవిత చేసిన మరో పని బీఆర్ఎస్ శ్రేణులకు ఫుల్ క్లారిటీ ఇస్తోంది. తనకేమీ పట్టనట్టు, కేటీఆర్ విచారణకు అసలే మాత్రం ప్రయారిటీ ఇవ్వట్లేదనేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని అంటున్నారు. అన్నకు బిగ్ డే లాంటి రోజున.. కవిత మాత్రం తన రెగ్యులర్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. అలా కుదిరిందో.. కావాలనే అలా కుదిరించుకున్నారో తెలీదు కానీ.. హైదరాబాద్‌కు దూరంగా ఓ భక్తి ప్రొగ్రామ్‌లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. జగిత్యాలలో ఓ గుడిలో స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజ చేశారు కవిత.
కలిసికట్టుగా ఎదుర్కొంటాం..
అయితే, కేటీఆర్ విచారణ గురించి అసలే మాత్రం మాట్లాడకపోతే బాగుండదు అనుకున్నారో ఏమో. ఏదో అలా రొటీన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని.. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్‌ను విచారణ చేశారని.. లేటెస్ట్‌గా కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తోందని.. ఇలాంటి వేధింపులకు భయపడే వాళ్లం కాదన్నారు కవిత. కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్ దగ్గర నేతలు, కార్యకర్తలను అడ్డుకోవడం దారుణమన్నారు. లాస్ట్‌లో మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. తమ పార్టీ లోపాలను సవరించుకుంటామని.. తమ మీదకు ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామంటూ అసలు మేటర్ అప్పుడు రివీల్ చేశారు. అంటే..? కవిత మాటలకు అర్థమేంటి?
వీర తిలకం దిద్దని చెల్లి
అన్న అన్నే.. రాజకీయం రాజకీయమే అనేదే కవిత స్ట్రాటజీనా? అన్నతో విభేదాలున్నాయి కాబట్టి.. దెయ్యాలు గట్రా అంటూ తిట్టేశారా? ఇప్పుడు అన్నను విచారణకు పిలిచే సరికి కలిసికట్టుగా ఎదుర్కొంటాం అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారా? మరి, అంతగా కలిసే ఉంటే.. అన్న కోసం మిగతా నేతలతో పాటు కవిత సైతం వెంట రావొచ్చుగా? జగిత్యాల టూర్ రద్దు చేసుకోవచ్చుగా? ఉదయమే ఓ ట్వీట్ పెట్టొచ్చుగా? అలా ఏమీ చేయకుండా.. గుడికెళ్లి.. కుంకుమ పూజ చేసుకుని.. తీరిగ్గా ఓ పొలిటికల్ డైలాగ్ కొట్టేస్తే సరిపోతుందా? అని అడుగుతున్నారు గులాబీ శ్రేణులు. ఏసీబీ ఎంక్వైరీకి వెళ్లే ముందు ఎవరెవరో మహిళలకు వచ్చి కేటీఆర్‌కు వీర తిలకం దిద్దితే.. అసలు చెల్లి ముఖం చాటేసి.. తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు?