E-Paper
Advertisement

Wasim Akram: ఇండియా చేతిలో ఓడితే, మావోళ్లు టీవీలు ప‌గుల‌కొడ‌తారు, పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడులు కూడా !

Wasim Akram: ఇండియా చేతిలో ఓడితే, మావోళ్లు టీవీలు ప‌గుల‌కొడ‌తారు, పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడులు కూడా !
Advertisement

Wasim Akram: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కొనసాగుతుంది. అంటే దాదాపు నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ( Wasim Akram ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించడం పై స్పందించారు. ఇండియాతో కచ్చితంగా పాకిస్తాన్ మ్యాచ్ ఆడాలని వెల్లడించారు. అయితే ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే మావోళ్ళు అస్సలు ఊరుకోరు.. టీవీలు ఆఫ్ చేయడం, కొంత మంది బద్దలు కొట్టడం చేస్తూ ఉంటారని హాట్ కామెంట్స్ చేశారు వసీం అక్రమ్. మరి కొంత మంది అయితే పాకిస్తాన్ క్రికెటర్ల పై దాడి చేసేందుకు కూడా విమానాశ్రయాలలో ప్రయత్నాలు చేస్తారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు.

Also Read: RCB-Jacqueline Fernandez: శృంగార తార కోసం రూ.8300 కోట్లు..? జైలులో ఉన్న సుకేష్ సంచలన ఆఫర్

ఇండియా చేతిలో ఓడిపోతే టీవీలు బద్దలు కొడతారు – వసీం అక్రమ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు లేనట్లే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే టీవీలు ( Pakistan Tvs) బద్దలు కొడతారని, అంతలా పాకిస్తాన్ లో క్రికెట్ ను ఆదరిస్తారని వివరించారు. ప్రతిరోజు ఇండియా చేతిలో ఓడిపోకూడదని ఫాన్స్ అల్లాను మొక్కుతారని గుర్తు చేశారు. గడిచిన మూడు సంవత్సరాలలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Pakistan Rivalry) మధ్య చాలా మ్యాచులు జరిగాయి… కానీ ఇందులో ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే పాకిస్తాన్ గెలిచిందని గుర్తు చేశారు వసీం అక్రమ్.

మిగిలిన అన్ని మ్యాచ్ లు కూడా ఇండియా గెలిచిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పాకిస్తాన్ అభిమానులు తమ దేశంలో టీవీలు బద్దలు కొట్టారని వెల్లడించారు. కానీ కామెంట్రీ చేసే తాము మాత్రం పాకిస్తాన్ గెలిచినా, ఓడినా గుండెను బండరాయిలా చేసుకుని ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. గెలుపు ఓటములను పక్కకు పెట్టి, ఉక్కు మనిషిలా నిలబడాలని తెలిపారు. అక్కడ భావోద్వేగాలు పనికిరావని కేవలం కామెంట్రీ మాత్రమే చెప్పుకోవాల్సిందేనని తెలిపారు. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని వ్యాఖ్యానించారు.

బంగ్లాదేశ్ పేరుతో డ్రామాలు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఇండియాలో పాకిస్తాన్ పర్యటించబోదు కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ బంగ్లాదేశ్ విషయంలో ఇండియా అలాగే ఐసీసీ వ్యవహరించిన తీరు నేపథ్యంలో పాకిస్తాన్ బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుందట.

Also Read: Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

 

 

 

 

Related News

ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప‌ని అయిపోయింది..ఇక రిటైర్మెంట్ ఇచ్చేయండి

CSKతో పాటు ధోని కెరీర్ మార్చేశాడు..కానీ చివరకు అప్పుల బాధతో ఆత్మహ*త్య చేసుకున్నాడు

ఫ్లాట్ పిచ్ పైనే అభిషేక్ శర్మ ప్రతాపం… ఇజ్జత్ తీసిన రవిశాస్త్రి

హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయలేడు…బాంబ్ పేల్చిన గంభీర్

బ‌ల‌హీన‌మైన ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచి హీరోలుగా బిల్డ‌ప్ ఇస్తున్నారు

మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

అందుకే నా కొడుకు ఓం నమః శివాయ సెల‌బ్రేష‌న్స్ చేశాడు..అభిషేక్ శర్మ తండ్రి సంచ‌ల‌నం

వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌గాడు కాదు, వాడు తేడా అంటూ ట్రోల్స్‌..!

Big Stories

Advertisement
×