BigTV English

Glenn Maxwell : ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఐపీఎల్ ఆడుతా: మ్యాక్స్ వెల్

Glenn Maxwell :  ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఐపీఎల్ ఆడుతా: మ్యాక్స్ వెల్
Glenn Maxwell latest news

Glenn Maxwell latest news(Today’s sports news):

నాకు ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడతానని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ తెలిపాడు. ఐపీఎల్ తన కెరీర్ కి ఎంతో మేలు చేసిందని అన్నాడు. నిజానికి నా ఆటను గాడిలో పెట్టినని ఐపీఎల్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున మ్యాక్స్ వెల్ ఆడుతున్నాడు.


క్రికెట్లో ఎన్నోసార్లు తప్పులు చేస్తుంటాం. మనకి తెలీకుండానే పొరపాట్లు జరుగుతుంటాయి. నేను ఆస్ట్రేలియా జట్టు వరకే ఆడితే, ఆ కొన్ని మ్యాచ్ ల వల్ల జరిగే పొరపాట్ల నుంచి నేర్చుకుని, సరిదిద్దుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.

అదే ఐపీఎల్ లో లెక్కలేనన్ని మ్యాచ్ లు ఆడుతుంటాం,. ఎన్నో సార్లు అవుట్ అవుతుంటాం. ప్రతిసారి ఒక కొత్త బాల్ మనల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. వాటన్నింటిని నెట్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, తద్వారా మన ఆటతీరును మెరుగు పరుచుకోవచ్చునని తెలిపారు.


అంతేకాదు మన ఒక్కడి ఆటే కాదు, పక్క జట్లలోని బ్యాటర్ల ఆటను కూడా చూసి సాంకేతికంగా ఎదగవచ్చునని వివరించాడు. అలాగే ఇక్కడ ఎంతో మంది సీనియర్ క్రికెటర్లు ఆడుతున్నారు. వారు అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పి, ఇక్కడ ప్రత్యక్షమవుతున్నారు. వారి సలహాలు మనకెంతో ఉపయోగ పడతాయని మ్యాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై తనకెంత మమకారం ఉంది, ప్రేమ, అభిమానం ఉందో చెప్పకనే చెప్పాడు. నడిచే ఓపిక ఉన్నంతవరకు ఐపీఎల్ ని వదలనని తెలిపాడు. ఈ మాటతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 2008లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఐపీఎల్ అనతి కాలంలోనే గుర్తింపుపొందింది. క్రికెట్ ప్రేమికులు కూడా  క్రికెట్‌ను చూసే కోణమే మారిపోయింది. ఐపీఎల్‌ స్ఫూర్తితో.. చాలా దేశాల్లో ఇదే తరహా లీగ్‌ను ప్రవేశపెట్టారు. కానీ ఇంత సక్సెస్ కాలేదనే చెప్పాలి.

చాలామంది క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడితే తమ ఆటతీరు మారుతుంది, ఆర్థికంగా కూడా బాగుంటుందని భావిస్తున్నారు. ఐపీఎల్ ఆడి స్థిరపడిన క్రికెటర్లు కూడా ఉన్నారు. చాలామంది విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడేందుకు ఉత్సాహ పడుతుంటారు. కొందరు క్రికెటర్లు లీగ్ ద్వారానే గుర్తింపు పొందడం విశేషం. మొత్తానికి మ్యాక్స్ వెల్ మాటలతో ఐపీఎల్ లీగ్ పై మళ్లీ ఆసక్తికర చర్చ అయితే మొదలైంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×