E-Paper
Advertisement

Medchal: అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్.. పునర్జన్మనిచ్చిన 108 సిబ్బంది..

Medchal: అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్.. పునర్జన్మనిచ్చిన 108 సిబ్బంది..
Advertisement

Medchal: అప్పుడే పుట్టిన పసికందుకు ప్రాణం పోసి మరో జన్మనిచ్చారు 108 సిబ్బంది. మేడ్చల్‌ జిల్లా కీసర ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది దుర్గ. ఆమెకు నార్మల్ డెలివరీ అయింది. అయితే.. పుట్టిన బిడ్డకు ఎలాంటి చలనం లేకపోవడంతో దుర్గ దంపతులు తల్లడిల్లిపోయారు. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు బేబీకి హాట్‌ బీట్‌ లేదని చెప్పి.. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఎలాగైనా తమ బిడ్డను బతికించాలని కాళ్లా వేళ్లా పడి బతిమాలుకుంది దుర్గ.

పాపకు వెంటనే చికిత్స అందించేందుకు హుటాహుటిన 108లో పసిబిడ్డను తరలిస్తూనే CPR చేశారు 108 సిబ్బంది. దీంతో వెంటనే ఆ బిడ్డ ఊపిరి తీసుకుని కెవ్వుమని ఏడవటం స్టార్ట్ చేసింది. పాప ఏడుపుతో ఆ తల్లిదండ్రుల కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. ఒక్కసారిగా పాపలో చలనం రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు 108 సిబ్బంది. ఇక తమ బిడ్డకు మరో జన్మనిచ్చారంటూ దుర్గ దంపతులు హృదయపూర్వకంగా 108 సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×