E-Paper
Advertisement

ICC Rates Cape Town Pitch : సౌతాఫ్రికా కేప్ టౌన్ పిచ్.. ఓ చెత్త.. ఐసీసీ రేటింగ్

ICC Rates Cape Town Pitch : సౌతాఫ్రికా కేప్ టౌన్ పిచ్.. ఓ చెత్త.. ఐసీసీ రేటింగ్
Advertisement

ICC Rates Cape Town Pitch : ఇన్నాళ్లూ విదేశీ మీడియా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కూసిన అవాకులు, చవాకులు గాలికి కొట్టుకుపోయాయి. ఐసీసీ చాలా సీరియస్ గా ఉందని, రోహిత్ శర్మ చిక్కుల్లో ఉన్నాడని గాలి వార్తలన్నీ గుమ్మరించింది. ఎప్పటిలా భారతదేశంపై తన విషాన్ని వెళ్లగక్కింది.

కానీ ఐసీసీ మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మకే పరోక్షంగా తమ మద్దతు తెలిపింది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ పిచ్‌ పై ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.  మ్యాచ్ రిఫరీ క్రిస్ బాడ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇది ఒక చెత్త పిచ్ అని చెబుతూనే, అసంత్రప్తికరం అని పేర్కొంది. ఇంకా కోపం తగ్గక ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.

Advertisement

మ్యాచ్ జరుగుతున్నంత సేపు పిచ్‌ చాలా భయంకరంగా స్పందించిందని మ్యాచ్ రిఫరీ తన నివేదికలో పేర్కొన్నారు. బ్యాటర్లు చాలామంది గ్లౌస్ కి బాల్ తగిలి దెబ్బలు కూడా తగిలాయని అన్నారు. ఇలాంటి పిచ్ లపై ఆడి, గాయాల పాలైతే, ఆటగాళ్ల కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉందని అన్నాడు. పిచ్ పై బాల్ అనూహ్యంగా బౌన్స్ అయిందని, అందుకే త్వరగా వికెట్లు పడ్డాయని తెలిపాడు.

ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టసాధ్యంగా మారింది. బాల్ కొన్ని సార్లు ప్రమాదకరంగా స్పందించిందని తెలిపాడు. అందుకనే ఐసీసీ కూడా సీరియస్ గా స్పందించింది. ఐసీసీ ప్రమాణాలకు తగిన స్థాయిలో పిచ్ లేకపోవడంతో కేప్ టౌన్  గ్రౌండ్ కి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.  ఒక ఏడాదిలో ఆరు డి మెరిట్ పాయింట్ల గానీ వస్తే ఆ స్టేడియంపై ఏడాది నిషేధం విధిస్తారు. అదే12 పాయింట్లకు చేరితే రెండేళ్ల నిషేధం ఉంటుంది.

Advertisement

అయితే వ్యవహారం అంత దూరం వెళ్లదు. ఆ స్టేడియంలో కొన్నాళ్లు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడకుండా చూస్తారు. తర్వాత మళ్లీ యథాతథంగానే ఉంటాయని అంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా మనవాళ్లే కాదు, ఏ దేశపు ఆటగాళ్లు వెళ్లినా సరే, అక్కడి పిచ్ లు అలాగే ఉంటాయని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×