E-Paper
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లో విషాదం..! గాలిపటం ఎగరేస్తూ బాలుడు మృతి..!

Hyderabad : హైదరాబాద్‌లో విషాదం..! గాలిపటం ఎగరేస్తూ బాలుడు మృతి..!
Advertisement

Hyderabad : సంక్రాంతి పండుగ ఓ కుటుంబంలో విషాదం నింపింది. గాలిపటం ఎగురవేస్తూ భవనం పైనుంచి కింద పడి ఓ బాలుడు మరణించిన ఘటన హైదరాబాద్ నాగోల్ లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ. బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి నాగోల్‌లో అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుమారుడు శివకుమార్ (13) నాగోల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

సంక్రాంతి సెలవులు రావడంతో తోటి స్నేహితులతో శనివారం సాయంత్రం ఇంటి పైకి ఎక్కి గాలిపటం ఎగురవేస్తున్నాడు. ఈ సమయంలో గాలి రాకపోవడంతో పక్క బిల్డింగు పైకి వెళ్లి తోటి స్నేహితులతో గాలిపటం ఎగురేస్తుండగా ఆ ఇంట్లోని కుక్క అతడిపైకి ఎగబడింది. దీంతో భయపడిన శివకుమార్ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు వెనక్కు వెళ్లగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హఠాత్పరిణామంతో శివ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. తోటి స్నేహితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×