BigTV English

Rohit Sharma : టీ 20లో.. మొదటివాడిగా చరిత్ర సృష్టించనున్న రోహిత్!

Rohit Sharma : టీ 20లో.. మొదటివాడిగా చరిత్ర సృష్టించనున్న రోహిత్!
This image has an empty alt attribute; its file name is d22e7241c5a3495cd506ca0a6c745afc.jpg

Rohit Sharma : ఆశ్చర్యపోకండి…టీ20 చరిత్రలో రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డ్ కి దగ్గరగా ఉన్నాడు. ఇందులో పరుగులు చేయక్కర్లేదు, సిక్సర్లు కొట్టక్కర్లేదు. మొదటి టీ 20 మ్యాచ్ లో రన్ అవుట్ అయినప్పటికి తనకి ఒక అద్భుతమైన రికార్డ్ చేరువైంది. అదేమిటంటే 100 విజయవంతమైన టీ 20 మ్యాచ్ ల్లో తను భాగమయ్యాడు.


ఇప్పుడు కూడా ఆఫ్గాన్ తో జరిగే రెండోటీ20 లో ఒక రికార్డ్ చేరువ కానుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఆటగాడికీ సాధ్యం కానీ రికార్డును అధిగమించనున్నాడు. అదేమిటంటే రోహిత్ తన కెరీర్ లో ఇప్పుడు 150వ టీ 20 మ్యాచ్ ఆడనున్నాడు. అలా 150 మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్‌గా నిలవనున్నాడు.

ఈ రికార్డులో రోహిత్ శర్మ దరిదాపుల్లో కూడా మరో టీమిండియా ప్లేయర్ లేడు. కానీ 115 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ 11వ స్థానంలో ఉన్నాడు. బహుశా వచ్చే టీ 20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కూడా టీ 20ల నుంచి రిటైర్ కావచ్చు. అప్పుడు తనకి ఈ రికార్డ్ అధిగమించే అవకాశం ఉండదు.


2007లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి రోహిత్ శర్మ అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 149 మ్యాచులు ఆడాడు. అందులో 3853 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొదటి స్థానంలో 4008 పరుగులతో విరాట్ కొహ్లీ ఉన్నాడు. మరో 155 పరుగులు చేస్తే తన రికార్డ్ దాటుతాడు. ఇంకా ఆఫ్గాన్ తో రెండు టీ 20లు మ్యాచ్ లున్నాయి. అలాగే టీ 20లో 182 సిక్సర్లు కొట్టాడు. మరో 18 కొడితే డబుల్ సెంచరీ సిక్సర్లు కొట్టినట్టు అవుతుంది.

తొలి టీ 20 మ్యాచ్ లో ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు రెండో టీ 20లో వీరి మధ్య సమన్వయం ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తనకి తను తమాయించుకుని ముందుకెళితే రోహిత్ శర్మ ముందు రికార్డులు తలవంచుతాయని అంటున్నారు. లేదంటే కోపంతో ఊగిపోతే, ఆ రికార్డులు మరింత దూరమవుతాయని నెటిజన్లు సూచిస్తున్నారు. అయినా రోహిత్ శర్మకి రికార్డులను పట్టించుకోడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×