E-Paper
Advertisement

Rajanna Sircilla : రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి..

Rajanna Sircilla : రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి..
Advertisement
Rajanna Sircilla news

Rajanna Sircilla news(Today news in telangana) :

గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామంలో చోటుచేసుకుంది. దంపతులు తాళ్లపల్లి శంకర్, సరితకు ఇద్దరు కొడుకులు యశ్వంత్, సుశాంత్. చిన్న కొడుకు సుశాంత్‌కు 13 ఏళ్లు. ముస్తాబాద్ గురుకుల స్కూల్‌‌లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కు క్రిస్మస్‌ సెలవులు రావడంతో ఇటీవల ఇంటికి వచ్చాడు సుశాంత్. సోమవారం ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి వచ్చింది. నొప్పి ఎక్కువ కావడంతో అల్లాడుతూ తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. గుండెపోటు రావడంతోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నిన్నమొన్నటి వరకు ఇంట్లో అల్లారుముద్దగా తిరిగిన కొడుకు..అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోధనలు స్థానికుల కంటతడిపెట్టిస్తుంది. బాలుడు సుశాంత్‌ మృతి.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×