E-Paper
Advertisement

Mahbubnagar : న్యూ ఇయర్ వేడుకల వేళ.. గురుకుల కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

Mahbubnagar :  న్యూ ఇయర్ వేడుకల వేళ.. గురుకుల కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి
Advertisement

Mahbubnagar : విద్యార్థులంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ.. ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడు గ్రామనికి చెందిన హన్మంత్ రెడ్డి అనే వ్యక్తి కుమారుడు రాంరెడ్డి(17) మహబుబ్ నగర్ ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి స్టడీ అవర్ జరుగుతుండగా ఐదో అంతస్తులో ఉన్న తన గదికి వెళ్లి పడుకున్నాడు.

తెల్లవారుజామున 3.31 గంటలకు రాంరెడ్డి పడుకున్న గది నుంచి రెండో అంతస్తులో ఉన్న గదికి వెళ్ళాడు. తలుపు గడియ పెట్టుకున్నాడు. గదిలోని సీసీ కెమెరా పైకి తిప్పాడు. తర్వాత గదిలో రాంరెడ్డి టవల్ తో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. కళాశాల సిబ్బంది గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అని సీఐ తెలిపారు.

Advertisement

కాగా.. విద్యార్థి తల్లిదండ్రులు , బంధువులు తమకు న్యాయం చేయాలంటు కళాశాల దగ్గర ఆందోళనకు దిగారు. విద్యార్థి తండ్రి.. తమ కుమారుడి మెడ వద్ద గాయాలు ఉన్నాయని.. ఈ విషయం పై స్పష్టత ఇవ్వాలని కోరాడు. తమ కుమారుడి మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రాంరెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×