E-Paper
Advertisement

LB Nagar : దారుణం.. లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడి మృతి

LB Nagar : దారుణం.. లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడి మృతి
Advertisement

LB Nagar : లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన దారుణ ఘటన ఎల్ బీ నగర్ లో జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్ మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఇటీవల నిర్మించిన ఉప్పలాస్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నాగరాజు అనే వ్యక్తి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. నాగరాజు – అనురాధ దంపతులకు నాలుగేళ్ల కొడుకు అక్షయ్ ఉన్నాడు. అక్షయ్ ఆడుకుంటూ లిఫ్ట్ వద్దకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. బిగ్గరగా కేకలు పెట్టగా.. అవి విన్న తల్లిదండ్రులు లిఫ్ట్ లో ఇరుక్కున్న అక్షయ్ ను అతికష్టం మీద బయటకు తీశారు.

వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్షయ్ మరణించాడు. లిఫ్ట్ లో ఇరుక్కుని కొడుకు చనిపోవడంతో.. ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్షయ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా.. బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోస్టుమార్టం కు పంపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కాగా.. ఆ అపార్ట్ మెంట్ లో తరచూ లిఫ్ట్ రిపేర్ వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కూడా లిఫ్ట్ పనిచేయకపోవడంతో అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×