BigTV English

Indian died in Missile attack in Israel: ఇజ్రాయెల్ పై మిస్సైల్ ఎటాక్ .. భారతీయుడు మృతి!

Indian died in Missile attack in Israel: ఇజ్రాయెల్ పై మిస్సైల్ ఎటాక్ .. భారతీయుడు  మృతి!

 


missile attack on israel

Indian from Kerala killed, 2 others injured in missile attack in Israel: ఇజ్రాయెల్ , హమాస్ మధ్య యుద్ధం రోజు రోజుకి  జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్ కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపు చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణి దాడుల్లో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాధితులు ముగ్గురు కేరళకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన సోమవారం ఉదయం 11 గంటలకు ఉత్తర సరిహద్దులోని మార్గాలియోట్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.


కేరళలోని కొల్లామ్ కి చెందిన పట్నిబిన్ మాక్స్ వెల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జివ్ ఆస్పత్రిలో ఆయన మృతి దేహాన్ని గుర్తించారు. ఈ దాడిలో గాయపడిన జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ కు చికిత్స అందిస్తున్నారు. పాల్ మెల్విన్ కు శస్త్రచికిత్స జరిగినట్లు అధికారులు తెలిపారు. జార్జ్ అనే వ్యక్తిని బెలిన్ సన్ ఆసుపపత్రికి తీసుకెళ్లారు. అతని ముఖానికి శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. భారత్ లోని అతని కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Read more: ప్రాణంతకంగా మౌత్ ఫ్రెషనర్.. రక్తపు వాంతులు చేసుకున్న కస్టమర్లు

ఈ దాడి చేయడం హెజ్ బొల్లా పనేనని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హమాస్ కు మద్దతుగా ఈ గ్రూపు అక్టోబర్ 8నుంచి ఉత్తర ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో తరుచూ దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే హెజ్ బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది.

హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాలోని పాలస్తీనా ప్రజలు, హమాస్ నేతలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హెజ్ బొల్లాతో ఇజ్రాయెల్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో వీరి పైన ఐడిఎఫ్ దాడులు చేపడుతోంది. ఇప్పటికే ఈ ఘర్షణలో ఏడుగురు పౌరులతో పాటు 10 మంది సైనికులు మరణించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు వల్ల 229 మంది మరణించారని హెజ్ బొల్లా తెలిపింది.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×