E-Paper
Advertisement

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఆ రోజు ఎన్ని లక్షల మంది జర్నీ చేశారంటే..?

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఆ రోజు ఎన్ని లక్షల మంది జర్నీ చేశారంటే..?
Advertisement

Hyderabad Metro latest updates(Telangana today news): హైదరాబాద్‌ మెట్రో రైలు మరో రికార్డు సృష్టించింది. ఈ నెల 3న 5.10 లక్షల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారు. మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. కారిడార్‌-1 మియాపూర్‌–ఎల్‌బీనగర్‌ మార్గంలో ప్రయాణికుల సంఖ్యలో ఎక్కువగా ఉంది.

సోమవారం కారిడార్‌-1లో 2.60 లక్షల మంది ప్రయాణించారు. ఆ తర్వాత కారిడార్‌-3 నాగోల్‌– రాయదుర్గం మార్గం రెండో స్థానంలో ఉంది. ఈ రూట్ లో 2.25 లక్షల మంది జర్నీ చేశారు. రాయదుర్గం స్టేషన్‌ నుంచి అత్యధికంగా 32 వేల మంది ప్రయాణం చేశారు. ఎల్‌బీ నగర్‌ నుంచి 30 వేల మంది, అమీర్‌పేట్‌ నుంచి 29 వేల మంది, మియాపూర్‌ నుంచి 23 వేల మంది మెట్రోలో రాకపోకలు సాగించారు.

Advertisement

2017లో నవంబర్ 29న హైదరాబాద్‌ మెట్రోలో సర్వీసులు అందుబాటులో వచ్చాయి. 3 కారిడార్‌లలో 69 కిలో మీటర్లు మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 56 మెట్రో స్టేషన్‌లు ఉన్నాయి. కరోనా ప్రభావంతో కొన్నాళ్లు ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉండేది. ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి కార్యాలయాలకు రావడంతో మెట్రోలో క్రమంగా రద్దీ పెరిగింది.

రోజు వారి మెట్రో ప్రయాణికులు 5.10 లక్షలు దాటిన నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. హైటెక్‌ సిటీకి వెళ్లే మార్గంలో మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×