E-Paper
Advertisement

Jagan : సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?

Jagan : సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?
Advertisement

Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. మే చివరి వారంలో జగన్ ఢిల్లీ వెళ్లారు. అప్పుడు వారంరోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు మరోసారి హస్తినకు సీఎం జగన్ వెళ్లారు.

ఢిల్లీ­లోని జనపథ్‌–1 నివాసానికి జగన్ చేరుకున్నారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలుస్తారని తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో చర్చిస్తారని సమాచారం.

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను జగన్ కలుస్తారని తెలుస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారని సమాచారం. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశమవుతారు. బుధవారం రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. గురువారం కేంద్ర జలశక్తి మంత్రి, అందుబాటులో ఉన్న ఇతర కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వస్తారు.

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ అంశాలను ప్రధానంగా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×