E-Paper
Advertisement

క్షుద్రపూజల అనుమానం.. 55 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య, హైదరాబాద్‌లో రాత్రి వేళ ఘటన

క్షుద్రపూజల అనుమానం.. 55 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య, హైదరాబాద్‌లో రాత్రి వేళ ఘటన
Advertisement

Hyderabad City: హైదరాబాద్ సిటీలో రాత్రి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన చంపాపేటలోని గుండాల షా బాబా రోడ్డులో జరిగింది. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికిక చేరుకున్నారు. అసలు ఏం జరిగింది?

 

హైదరాబాద్‌లో రాత్రి వేళ ఘటన

Advertisement

హైదరాబాద్‌ సిటీలో రాత్రి గుండాల్‌షాబాబా రోడ్డులో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నాడనే నెపంతో 55 ఏళ్ల ఉమర్‌పై దాడి చేసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. హత్య గురించి సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం ప్రక్రియ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య విషయం తెలియగానే ఎంఐఎం నాయకులు అక్కడికి చేరుకున్నారు. అతడ్ని గుర్తించిన నేతలు,రియాజ్‌ ఇంటికి వెళ్లారు. హత్య విషయాన్ని మృతుడి కుటుంబసభ్యులకు చెప్పారు. మృతుడి సోదరుడు, బంధువులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.

Advertisement

 

క్షుద్రపూజల అనుమానం.. 55 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య

ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను అరెస్టు చేయాలని కోరారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఈ కేసు దర్యాప్తు చేయాలని కోరారు. సాక్షులు ముందుకు వచ్చేలా వారికి భద్రత కల్పించాలని, కేసు నీరుగారకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ALSO READ: విద్యార్థులకు హుషారైన కబురు.. నో బ్యాగ్ డే పద్దతి అమలు, క్రియేటివిటీకి పదును

హైదరాబాద్‌ సిటీలో రాత్రివేళ రకరకాల ఘటనల నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటన నేపథ్యంలో పెట్రోలింగ్ మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఎంఐఎం నాయకులు. నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను కోరారు. పోస్టుమార్టం తర్వాత మృతుడి వివరాలు తెలియనున్నాయి.

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×