E-Paper
Advertisement

విద్యార్థులకు హుషారైన కబురు.. నో బ్యాగ్ డే పద్దతి అమలు, క్రియేటివిటీకి పదును

విద్యార్థులకు హుషారైన కబురు.. నో బ్యాగ్ డే పద్దతి అమలు, క్రియేటివిటీకి పదును
Advertisement

Hyderabad: ప్రతీ రోజు కిలోల కొద్దీ పుస్తకాలు మోసి అలసిపోతున్న విద్యార్థులకు హుషారైన కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం క్లాసులు వినడం, హోంవర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రాయడం కాదు. విద్యార్థుల్లో టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బయటకు తీసేందుకు ‘నో బ్యాగ్ లెస్’ వ్యవస్థని తీసుకొచ్చింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలోని పాఠశాలలో కొత్త మార్పులు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త విధానాన్ని అమలు చేయనుంది తెలంగాణ గవర్నమెంట్. ఈ విద్యా సంవత్సరం ఒకటి నుంచి పదో తరగతి వరకు టెన్ బ్యాగ్ లెస్ డేస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెల మూడో శనివారం నో బ్యాగ్ లెస్ డే కొనసాగనుంది. 2026 సెప్టెంబర్ నుంచి 2027 మార్చి వరకు నిర్వహించాల్సిన తేదీలను ఫైనల్ చేసింది విద్యాశాఖ.

నెలకు ఒకరోజు నో బ్యాగ్ డే, ఆ రోజు క్రియేటివిటీకి పదును

Advertisement

సెప్టెంబర్ 19, నవంబర్ 21, డిసెంబర్ 19, 2027లోని ఫిబ్రవరి 20, మార్చి 20న తేదీలను ప్రత్యేకంగా ప్రకటించింది. ఆయా రోజుల్లో విద్యార్థులు పాఠశాలకు పుస్తకాల బ్యాగులు లేకుండా రావాలి. మిగతా రోజుల్లో తరగతులు నిర్వహించుకోవాలని సూచించింది. పుస్తకాలు లేని రోజుల్లో ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యూల్ ఆధారంగా కొత్త అభ్యాస పద్ధతులు అమలవుతాయి.

షెడ్యూల్ కూడా రెడీ, బాధ్యత అంతా వారిదే

విహార యాత్రలు, క్విజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బాల సభలు, డ్రాయింగ్, నాటిక, సైన్స్ ప్రయోగాలు, చేతి వృత్తులవారితో ఇంటరాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌ వంటి విభిన్న సృజనాత్మక విషయాలను నేర్పించనున్నారు. దీనివల్ల విద్యార్థు్ల్లో సబ్జెక్ట్ నైపుణ్యాలే కాకుండా పరిశీలన, ఆచరణాత్మక ఆలోచనలు, లీడర్‌ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయన్నది అధికారుల అంచనా. బ్యాగ్ లెస్ డేను తెలంగాణ వ్యాప్తంగా అమలయ్యేలా చూసే బాధ్యతను ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈఓలకు పూర్తి బాధ్యత ఉండనుంది.

Advertisement

ALSO READ: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ సిటీలో చినుకులు..

దీనికితోడు పాఠశాల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులకు ఇందులో కీలకపాత్ర. స్కూల్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వార్షిక ప్రణాళిక రెడీ చేయాలని ఇప్పటికే సూచనలు ఇచ్చారు. దివ్యాంగులైన పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కానున్నారు. అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డోర్ ట్రిప్స్ సమయంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తాజగా ఆదేశాల్లో స్పష్టం చేసింది విద్యాశాఖ.

Related News

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న ఆరు కార్లు, హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన

కరువును ఎదిరించి.. ఎండిన పొలాలను తడిపి.. చిన్నమాధారం అన్నదాతల భగీరథ ప్రయత్నం!

జర్నలిస్టుకు అండగా బిగ్ టీవీ చైర్మెన్ .. TWJF అభినందనలు

మోడల్ స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. లక్షల రూపాయలు ఇక సేఫ్!

Big Stories

Advertisement
×