E-Paper
Advertisement

మంత్రి సురేఖపై చర్యలు లేనట్టేనా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

మంత్రి సురేఖపై చర్యలు లేనట్టేనా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!
Advertisement

Konda Surekha: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాలు, రాజకీయ విశ్లేషకుల్లోనూ కొత్త చర్చకు తెరలేపాయి. ఒక టీవీ ఛానెల్ డిబేట్‌లో ఆయన మాట్లాడిన మాటలు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ, బీసీ సమీకరణాల చుట్టూ తిరుగుతున్నాయి.

క్రమశిక్షణా చర్యలు..

మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో కొండా సురేఖపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండే అవకాశం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొండా సుష్మిత వ్యాఖ్యలు అనంతరం జరిగిన పరిణామాలతో సురేఖ మంత్రి పదవి నుంచి తొలగింపు తప్పదనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. అయితే, దీనిపై తాజాగా స్పందించిన టీపీసీసీ చీఫ్ – “బీసీలకు మంత్రివర్గంలో దక్కాల్సిన వాటా ఇంకా దక్కలేదు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించి, ఆ స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వడం సరికాదు. ఒకవేళ బీసీలకు ప్రాతినిధ్యం పెంచాలనుకుంటే, మంత్రివర్గాన్ని విస్తరించి కొత్తగా అవకాశాలు ఇవ్వాలి తప్ప ఉన్నవారిని తొలగించడం సరైన పద్ధతి కాదు” అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది పొలిటికల్ సర్కిళ్లలో చర్చాంశనీయమైంది.

Advertisement

Also read: సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!

అధిష్టానం ఆలోచన ఏమిటో..?

మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. బీసీ వర్గానికి చెందిన మహిళా నేతను పదవి నుంచి తొలగిస్తే, అది పార్టీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే ఆందోళన పార్టీ వర్గాల్లో ఉంది.ముఖ్యంగా సామాజిక సమీకరణల దృష్ట్యా బీసీ ఓటు బ్యాంకును దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నాయకత్వం ఈ తరహా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతానికి కొండా సురేఖను తప్పించే యోచనలో ప్రభుత్వం కానీ, పార్టీ కానీ లేదని పీసీసీ చీఫ్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.ఒకవేళ కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే, అది మంత్రివర్గ విస్తరణ ద్వారానే జరుగుతుందనే సూచనలు లభిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో సురేఖ ఎపిసోడ్‌కు ప్రస్తుతానికి తెరపడినట్లేనా ? అధిష్టానం వేరే ఏదైనా నిర్ణయం తీసుకోబోతోందా? అనేది త్వరలోనే తేలనున్నది.

క్రమశిక్షణ రిపోర్టుపై ఆ రోజే క్లారిటీ..కాస్త ఊరట…?

Advertisement

ఇక ఏఐసీసీకి అందజేసిన రిపోర్టుపై స్టేట్ పార్టీకి త్వరలోనే ఆదేశాలు అందనున్నాయి. కేసీ వేణుగోపాల్ పరిశీలన అనంతరం స్పష్టమైన సంకేతాలు వెలువడనున్నాయి. కానీ ఆ లోపే పీసీసీ చీఫ్​ చేసిన వ్యాఖ్యలు మంత్రి కొండా ఫ్యామిలీ, ఫాలోవర్స్ కు ఊరటను కలిస్తున్నాయి. ఈ వివాద ఎపిసోడ్ లో మంత్రి సురేఖపై చర్యలు లేకుంటే, ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలు, లీడర్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు క్రమశిక్షణ కమిటీ కూడా షాక్ కు గురయ్యే ఛాన్స్ ఉన్నది. వాస్తవానికి సుష్మిత వ్యాఖ్యలు చేసిన తర్వాత టీపీసీసీ చీఫ్​ కూడా ఇక తన చేతిలో ఏమీ లేదని, అంతా హైకమాండ్ చూసుకుంటుందని తేల్చేశారు. కానీ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాత్రం బీసీ నినాదంతో ఆమెకు మద్ధతు గా నిలవడం హాట్ టాఫిక్ గా మారింది. ఈ అంశంపై స్పష్టత రావాలంటే సెప్టెంబరు 2 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also read: టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

Tags

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×