E-Paper
Advertisement

Passenger: చెప్పు పోయిందని పోలీసులకు ఫిర్యాదు.. చివరికి ఏమైందంటే?

Passenger: చెప్పు పోయిందని పోలీసులకు ఫిర్యాదు.. చివరికి ఏమైందంటే?
Advertisement

Passenger: ఇటీవల ఓ మూడో తరగతి బాలుడు టీచర్ తనని కారణం లేకుండా కొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి వింత ఘటనలు పోలీసులకు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అయితే వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే పోలీసులకు మాత్రం ఊహించిన అనుభవం ఎదురైంది. అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

స్టేషన్ ఘనపూర్‌కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాడు. అప్పటికే కాకతీయ ప్యాసింజర్ రైలు కదలడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కాడు. హడావుడిగా రైలు ఎక్కడంతో అతని కాలుకున్న చెప్పు ఒకటి జారి ట్రాక్‌పై పడిపోయింది. ట్రైన్‌ ఆల్రడీ కదలడంతో దిగి తీసుకోలేని పరిస్థితి. ఇక చేసేది ఏమీ లేక అలానే హైదరాబాద్ వెళ్లాడు ఆ యువకుడు.

Advertisement

రూమ్‌కి వెళ్లాక అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ట్విట్టర్ వేదికగా రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ట్రైన్ ఎక్కుతుండగా తన చెప్పు జారిపడిపోయిందని.. ఎలాగైనా దాన్ని వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం స్టేషన్ ఘన్‌పూర్ స్టేషన్ వద్ద గాలించి ఎట్టకేలకు చెప్పును కనుగొన్నారు. ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు పిలుపించుకొని చెప్పును అప్పగించారు.

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×